ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yahya Sinwar: చివరి క్షణాల్లో సిన్వర్.. వీడియో

ABN, Publish Date - Oct 18 , 2024 | 02:23 PM

హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనిపై ఇప్పటి వరకు హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.

Yahya Sinwar

హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనిపై ఇప్పటి వరకు హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఆ భవనంలో ఉన్న సోఫాలో సిన్వర్ ఉండగా.. భవనం దాడికి గురయిన చిత్రాన్ని మనం చూడొచ్చు. ఆ డ్రోన్‌ను చూసిన ఒకతను కర్రను విసిరేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.


సోఫాలో సిన్వర్

‘మేం చేసిన దాడుల్లో భవనం శిథిలమైంది. లోపల హమాస్ మిటిలెంట్లు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేందుకు డ్రోన్ పంపించాం. సోఫాలో ఒకతను కూర్చొని కనిపించారు. అతనిని ఎవరో అనుకున్నాం. బాంబు దాడి తర్వాత భవనం కుప్పకూలింది. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. అతను సిన్వర్ అని తేలింది. శరీరంపై బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, గ్రనేడ్లు ఉన్నాయి అని’ ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు.


సిన్వర్ పోలికలు

సౌత్ గాజాలో ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. ఇందులో ఒకతనికి సిన్వర్ పోలికలు ఉన్నాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖ గుర్తించింది. అతని దంత నమునాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఇదివరకు ఇజ్రాయెల్ కస్టడీలో ఉన్న సమయంలో సేకరించిన డీఎన్ఏ నమూనాలతో వాటిని పరీక్షించి.. సిన్వర్ అని ధృవీకరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

Updated Date - Oct 18 , 2024 | 02:23 PM