ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T20 Worldcup: ``ఇంటికి వచ్చేస్తోంది``.. ప్రపంచకప్ గురించి ఆసక్తికర వీడియో షేర్ చేసిన బీసీసీఐ!

ABN, Publish Date - Jul 03 , 2024 | 12:57 PM

అద్భుత ఆటతీరుతో టీ20 ప్రపంచకప్ సాధించిన టీమిండియా సభ్యులు మరికొద్ది గంటల్లో స్వదేశానికి తిరిగి రాబోతున్నారు. వెస్టిండీస్ దీవుల్లోని బార్బొడాస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించి.. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను దక్కించుకుంది.

T20 Worldcup Trophy

అద్భుత ఆటతీరుతో టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) సాధించిన టీమిండియా సభ్యులు మరికొద్ది గంటల్లో స్వదేశానికి తిరిగి రాబోతున్నారు. వెస్టిండీస్ దీవుల్లోని బార్బొడాస్ (Barbados) వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో (Ind vs SA) భారత్ విజయం సాధించి.. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను దక్కించుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ఆదివారం లేదా సోమవారం టీమిండియా స్వదేశానికి రావాల్సి ఉంది. అయితే బార్బొడాస్‌లో తీవ్ర తుఫాను పరిస్థితులు నెలకొనడంతో రోహిత్ సేన అక్కడే చిక్కుకుపోయింది.


ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా నాలుగు రోజుల పాటు అక్కడే ఉండిపోయింది. భారత క్రికెట్ జట్టు సభ్యులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని బార్బొడాస్‌కు పంపించింది. బుధవారం రాత్రికి భారత క్రికెట్ జట్టు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. టీ20 ప్రపంచకప్ వీడియోను షేర్ చేసి.. ``అది ఇంటికి వచ్చేస్తోంది`` అని కామెంట్ చేసింది.


ఇక, ఈ నెల 6 నుంచి 14 వరకు జింబాబ్వేతో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సీరిస్ ఆడనుంది. దీనికోసం ఇప్పటికే బీసీసీఐ యువ జట్టును ప్రకటించింది. ఈ టూర్ కోసం రేపు భారత జట్టు జింబాబ్వే బయలుదేరనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

Virat Kohli - MS Dhoni: కోహ్లీతో పాటు నన్నూ ఇంటికి పంపించండి.. ధోనీ గురించి సంచలన విషయం బయటపెట్టిన పాక్ మాజీ ప్లేయర్!


రోహిత్‌ ఫోన్‌ చేసుండకపోతే..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 03 , 2024 | 12:57 PM

Advertising
Advertising