ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘బజ్‌బాల్‌’కు బీటలు

ABN, Publish Date - Feb 27 , 2024 | 04:27 AM

భారత్‌ దెబ్బకు.. ఇంగ్లండ్‌ ‘బజ్‌బాల్‌’ బీటలు వారింది. 84/0తో పటిష్ట దశ నుంచి 120/5తో కష్టాల్లోపడ్డప్పుడు.. కుర్రాళ్లు శుభ్‌మన్‌ గిల్‌ (52 నాటౌట్‌), ధ్రువ్‌ జురెల్‌ (39 నాటౌట్‌) మొక్కవోని పట్టుదలతో పోరాడారు....

నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్‌ విజయం

  • 3-1తో సిరీస్‌ వశం

  • గిల్‌, ధ్రువ్‌ అద్భుత పోరాటం

రాంచీ: భారత్‌ దెబ్బకు.. ఇంగ్లండ్‌ ‘బజ్‌బాల్‌’ బీటలు వారింది. 84/0తో పటిష్ట దశ నుంచి 120/5తో కష్టాల్లోపడ్డప్పుడు.. కుర్రాళ్లు శుభ్‌మన్‌ గిల్‌ (52 నాటౌట్‌), ధ్రువ్‌ జురెల్‌ (39 నాటౌట్‌) మొక్కవోని పట్టుదలతో పోరాడారు. దీంతో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. ఐదు టెస్ట్‌ల సిరీ్‌సను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1తో సొంతం చేసుకొంది. స్వదేశంలో టీమిండియాకిది వరుసగా 17వ సిరీస్‌ గెలుపు కావడం విశేషం. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా.. ఆటకు నాలుగో రోజైన సోమవారం ఓవర్‌నైట్‌ స్కోరు 40/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ 192/5 స్కోరు చేసి గెలిచింది. రోహిత్‌ శర్మ (55) అర్ధ శతకం సాధించగా.. జైస్వాల్‌ (37) ఫర్వాలేదనిపించాడు. బషీర్‌ 3 వికెట్లు తీశాడు. జురెల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఐదవ, ఆఖరి టెస్ట్‌ వచ్చేనెల 7 నుంచి ధర్మశాలలో జరగనుంది.

ధాటిగా ఆరంభించి..: విజయానికి కావాల్సింది మరో 152 పరుగులే కావడంతో.. భారత గెలుపుపై ఎవరికీ ఎటువంటి అనుమానాల్లేవు. అందుకు తగ్గట్టుగా తొలి సెషన్‌ను రోహిత్‌, జైస్వాల్‌ ఆశావహంగానే ఆరంభించారు. అండర్సన్‌ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్‌.. మిడాన్‌ మీదుగా చూడముచ్చటైన సిక్స్‌తో దాడికి దిగాడు. మరోవైపు జైస్వాల్‌.. బషీర్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో జోరు చూపాడు. దీంతో వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి స్టోక్స్‌.. 18వ ఓవర్‌లో రూట్‌ను రంగంలోని దించాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టిన రూట్‌.. మూడో బంతికే జైస్వాల్‌ను అవుట్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అర్ధ శతకం పూర్తి చేసుకొన్న రోహిత్‌ను హార్ట్‌లీ వెనక్కి పంపగా.. రజత్‌ పటీదార్‌ (0)ను బషీర్‌ డకౌట్‌ చేశాడు. కానీ, గిల్‌, జడేజా (33 బంతుల్లో 4) ఆచితూచి ఆడడంతో భారత్‌ 118/3తో లంచ్‌కు వెళ్లింది.

ఒడిదుడుకులకు లోనైనా..: రెండో సెషన్‌ ఆరంభంలో వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకొన్న టీమిండియా ఒక్కసారిగా ఒత్తిడిలో పడింది. కానీ, గిల్‌, జురెల్‌ ఆరో వికెట్‌కు 72 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. 39వ ఓవర్‌లో బషీర్‌ వేసిన ఫుల్‌టాస్‌ బంతిని జడేజా నేరుగా బెయిర్‌స్టో చేతుల్లోకి కొట్టాడు. ఆ తర్వాతి బంతికే సర్ఫరాజ్‌ (0)ను కూడా బషీర్‌ అవుట్‌ చేయడంతో.. టీమిండియా 120/5తో ఇబ్బందుల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో గిల్‌, జురెల్‌.. స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ టీమ్‌ను లక్ష్యం దిశగా నడిపించారు. 31 బంతులు ఎదుర్కొన్న తర్వాత కానీ ధ్రువ్‌ తొలి బౌండ్రీ సాధించలేదు. మరోవైపు 119 బంతులాడి ఒక్క ఫోర్‌ కూడా కొట్టని గిల్‌.. గెలుపునకు 20 పరుగులు అవసరమైనప్పుడు బషీర్‌ బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత జురెల్‌ ఫోర్‌, డబుల్‌తో జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించాడు.

స్కోరు బోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 353; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 307; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 145.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) ఫోక్స్‌ (బి) హార్ట్‌లీ 55, జైస్వాల్‌ (సి) అండర్సన్‌ (బి) రూట్‌ 37, గిల్‌ (నాటౌట్‌) 52, రజత్‌ (సి) పోప్‌ (బి) బషీర్‌ 0, జడేజా (సి) బెయిర్‌స్టో (బి) బషీర్‌ 4, సర్ఫరాజ్‌ (సి) పోప్‌ (బి) బషీర్‌ 0, జురెల్‌ (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 61 ఓవర్లలో 192/5; వికెట్ల పతనం: 1-84, 2-99, 3-100, 4-120, 5-120; బౌలింగ్‌: రూట్‌ 7-0-26-1, హార్ట్‌లీ 25-2-70-1, బషీర్‌ 26-4-79-3, అండర్సన్‌ 3-1-12-0.

1

సొంతగడ్డపై వరుసగా అత్యధిక (17) టెస్ట్‌ సిరీ్‌సలు నెగ్గిన జట్టుగా భారత్‌. 2013లో ఆస్ట్రేలియాపై విజయంతో టీమిండియా ఈ జైత్రయాత్రను ప్రారంభించింది. 1994-2000, 2004-2008 మధ్య ఆసీస్‌ వరుసగా పదేసి సిరీ్‌సలు నెగ్గింది.

మెకల్లమ్‌, స్టోక్స్‌ హయాంలో 2022లో ‘బజ్‌బాల్‌’ ఆట తీరును ఎంచుకొన్న తర్వాత ఇంగ్లండ్‌ సిరీస్‌ కోల్పోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా వరుసగా మూడు టెస్ట్‌ల్లో ఓడడం కూడా ఇదే ప్రథమం.

Updated Date - Feb 27 , 2024 | 04:27 AM

Advertising
Advertising