Venkatesh Iyer: వెంకటేశ్ అయ్యర్‌కు షాక్.. కేకేఆర్‌కు కొత్త కెప్టెన్ వచ్చేస్తున్నాడు
ABN, Publish Date - Dec 02 , 2024 | 02:57 PM
టైటిల్ గెలిచిన జట్టులో నుంచి ఆటగాళ్లను కొనేందుకు పోటీపడ్డ కేకేఆర్ కెప్టెన్ విషయంలో మాత్రం ఊహించని నిర్ణయం తీసుకుంది.. వెంకటేశ్ అయ్యర్ ను కాదని ఓ సీనియర్ కు ఈ బాధ్యతలు అప్పగించనుందని...
ముంబై: ఆర్సీబీ జట్టుతో హోరాహోరీగా పోటీపడి దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్ ను కేకేఆర్ జట్టు పక్కనపెట్టింది. జెడ్డా వేదికగా జరిగిన వేలంలో ఏకంగా 23.5 కోట్లకు ఈ ఫ్రాంచైజీ వెంకటేశ్ ను దక్కించుకుంది. దీంతో కేకేఆర్ జట్టు కెప్టెన్‌పై తీవ్ర చర్చ నడిచింది. కానీ, కేకేఆర్ అసలు ప్లానింగ్ వేరే ఉన్నట్టు తెలుస్తోంది. వెంకటేశ్ అయ్యర్‌కు బదులు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తాజా రిపోర్ట్ ప్రకారం సీనియర్ ఆటగాడు అజింక్యా రహానేకు సారథి బాధ్యతలు అప్పగించేందుకు కేకేఆర్ సిద్ధమైంది. ఈ మేరకు దాదాపు 90 శాతం రహానే ప్రతిపాదనే పాసైందని తెలుస్తోంది.
ఐపీఎల్‌లో అంతంత మాత్రమే..
రహానేను వేలంలో రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ క్రికెటర్‌కు వివిధ ఫార్మాట్లకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. కానీ, ఐపీఎల్ ను నడిపించిన అనుభవం కొంచెం తక్కువే. భారత జట్టుకు కెప్టెన్ లేని సమయంలో సైతం రహానే తన సేవలను అందించాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ జట్టుకు సారథిగా ఉన్నాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. 2018, 2019 సీజన్లలో మాత్రమే రాజస్తాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. 24 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలు మాత్రమే సాధించగలిగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు కెప్టెన్సీని రహానే ఇటీవల కోల్పోయిన సంగతి తెలిసిందే.
వెంకటేశ్‌కు కీలక బాధ్యతలు..?
ఇప్పటికే జట్టు కెప్టెన్ గా ఉన్న శ్రేయాస్ అయ్యర్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావడంలో కేకేఆర్ విఫలమైంది. దీంతో రహానేను కెప్టెన్‌ను చేయాలనే ఏకైక లక్ష్యంతో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడా బాధ్యతలు కూడా లాంఛనప్రాయమేనని సమాచారం. ఇక అదే సమయంలో వెంకటేశ్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్ రౌండర్ అయిన రహానేను భవిష్యత్తు అవసరాల కోసం మరింత తీర్చిదిద్దాలని భావిస్తోందట.
Jayden Seales: వెస్టిండీస్ బౌలర్ సంచలన రికార్డు.. 46 ఏళ్లలో ఇదే తొలిసారి
Updated Date - Dec 02 , 2024 | 02:57 PM