ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs Afghanistan: ఆఫ్ఘన్‌తో సిరీస్‌కు భారత జట్టు ఎంపిక.. ఆ ఇద్దరు స్టార్ల రీఎంట్రీ

ABN, Publish Date - Jan 07 , 2024 | 08:01 PM

ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ని సమం చేసిన టీమిండియా.. ఇప్పుడు మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. జనవరి 11వ తేదీ...

India vs Afghanistan: ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ని సమం చేసిన టీమిండియా.. ఇప్పుడు మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ సిరీస్ సాగనుంది. ఈ నేపథ్యంలోనే.. సెలెక్షన్ టీమ్ తాజాగా భారత జట్టుని ఎంపిక చేసింది. 16 మంది సభ్యులతో కూడిన టీమిండియాని ప్రకటించింది. శుభవార్త ఏమిటంటే.. దాదాపు 14 నెలల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌తో టీ20లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

2022 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో రోహిత్, కోహ్లీ చివరిసారిగా ఆడారు. అంతే.. ఆ తర్వాత మళ్లీ వీళ్లు టీ20ల్లో ఆడలేదు. ఇప్పుడు 14 నెలల తర్వాత ఆఫ్లన్‌తో సిరీస్‌కు వీరిని ఎంపిక చేశారు. ఈ జట్టుని రోహిత్ శర్మనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చాలాకాలం తర్వాత రోహిత్, కోహ్లీ టీ20ల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. టీ20 వరల్డ్‌కప్‌లోనూ వీళ్లు తప్పకుండా ఆడుతారన్న నమ్మకాలు బలపడ్డాయి. ఇక ఈ జట్టులో విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌కి స్థానం దక్కగా.. వికెట్ కీపర్లుగా జితేశ్ శర్మ, సంజు శాంసన్‌ని తీసుకున్నారు.


జితేశ్ శర్మతో పోలిస్తే సంజుకే ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి.. అతడినే ప్లేయింగ్ ఎలెవన్‌లో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి, దీనిని సంజు సద్వినియోగపరచుకుంటాడా? లేక చేజార్చుకుంటాడా? అనేది వేచి చూడాలి. మరోవైపు.. స్టార్‌ పేసర్లైన జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. గాయాల కారణంగా హార్దిక్‌ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈ సిరీస్‌కు దూరమయ్యారు. మహమ్మద్ షమీ సైతం గాయం కారణంగా వరల్డ్ కప్ ముగిసినప్పటి నుంచి జట్టుకి దూరంగానే ఉన్నాడు.

టీమిండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్

Updated Date - Jan 07 , 2024 | 09:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising