BCCI Secretery: బీసీసీఐ సెక్రెటరీ పోస్టు దక్కేదెవరికి.. రేసులో ఉన్నదెవరంటే..
ABN, Publish Date - Dec 04 , 2024 | 05:32 PM
బీసీసీఐ సెక్రటరీ పోస్టులో కొత్తగా వచ్చచేదెవరనే విషయంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
ఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ గా భారతీయుడైన జైషా ఇటీవల ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో అప్పటివరకు అతడు బాధ్యతలు నిర్వర్తించిన బీసీసీఐ సెక్రటరీ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. మరి ఈ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే విషయంపై పలు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా ఉన్న అనిల్ పటేల్, ప్రస్తుత బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవ్ జిత్ సైకియా పేర్లు ఈ రేసులో కొంత కాలంగా వినిపిస్తున్నాయి. మరో వైపు ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా బీసీసీఐ సెక్రటరీ పోస్టు కోసం ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ వార్తలను ఆయన ఖండించాడు.
ప్రస్తుతం బీసీసీఐ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. అసలీ పోస్టుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అసలేం జరుగుతుందో మాకు కూడా తెలియదు. ప్రస్తుతానికి ఈ విషయంపై అధికారులు, రాష్ట్ర క్రికెట్ సంఘాలు పెదవి విప్పడం లేదు. దీనికి ముందు బీసీసీఐ లో పరిష్కరించాల్సిన సమస్యలు మరిన్ని ఉన్నాయి. అప్పటివరకు బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవ్ జిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా కొనసాగుతారు. ఈ పోస్టులో ఉండాలంటే అసలు బీసీసీఐ ఎలా నడుస్తుందనే విషయంపై చాలా అవగాహన ఉండాలి అని తెలిపాయి.
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఇక్కడ నియామక ప్రక్రియ కాస్త భిన్నంగా ఉంటుంది. ఎన్నికైన ఆఫీస్ బేరర్ రాజీనామా చేస్తే 45 రోజుల్లోపు బోర్డు ప్రత్యేక సాధారణ సమావేశం నిర్వహిస్తారు. అతడి స్థానంలో కొత్తగా ఎవరిని తీసుకోవాలో వారు చర్చిస్తారు. ఈ ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం నాలుగు వారాల ముందు ఎన్నికల అధికారిని కూడా నియమించాల్సి ఉంటుంది.
Chamipons Trophy: భారత్‌లో అలాంటి ముప్పు లేదు కదా.. పీసీబీ డిమాండ్లపై బీసీసీఐ గట్టి కౌంటర్
Updated Date - Dec 04 , 2024 | 05:32 PM