IND vs AUS: కేఎల్ రాహుల్ చేసిన పనికి.. క్షణాల్లో ఆవిరైన ఆస్ట్రేలియా ఆనందం.. వీడియో
ABN, Publish Date - Dec 06 , 2024 | 12:31 PM
భారీ వికెట్ తీశామని పొరపడ్డ ఆస్ట్రేలియా జట్టు సంబరాల్లో మునిగితేలింది. కానీ, ఆ వెంటనే అంపైర్ నిర్ణయంతో నాలుక్కర్చుకుంది. ఈ వీడియో నెట్టింట పైరలవుతోంది...
ఆడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో కేఎల్ రాహుల్ కంగారూలను బోల్తా కొట్టించాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఈ స్టార్ ఆటగాడిని తప్పించేందుకు ఆసిస్ ప్రయత్నించి విఫలమైంది. అప్పటికే యశస్వి జైస్వాల్ ను పెవిలియన్‌కు పంపిన కంగారూలు రాహుల్ ని సైతం ఔట్ చేసామని పొరపడి వెంటనే సంబరాలు చేసుకున్నారు. అది చివరకు నోబాల్ అని తేలడంతో వారి ఉత్సాహం వెంటనే నీరుగారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తమ స్టార్ పేసర్ స్కాట్ బోలాండ్ ను రంగంలోకి దింపడంతో అతడు రాహుల్ కు వైడ్ ఆఫ్ స్టంప్ దిశగా లెంతీ డెలివరీని వేశాడు. దీనిని ఎదుర్కునేందుకు కష్టపడ్డ రాహుల్ బ్యాట్ ఫుట్ లో డిఫెండ్ ఆడాడు. ఆ బంతి బ్యాట్ కు దగ్గరగా వెళ్లింది. వెంటనే వికెట్ కీపర్ ఆ బంతిని క్యాచ్ పట్టాడు. అంపైర్ సైతం ఔట్ అని తేల్చడంతో వెంటనే ఆసిస్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. రాహుల్ సైతం ఫీల్డ్ ని వీడేందుకు సిద్ధం కాగా.. వెంటనే విరాట్ కోహ్లీ సైతం తన వంతు వచ్చిందనుకుని గ్రౌండ్ వైపు అడుగులు వేశాడు. కానీ, ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. బౌలర్ ఓవర్ స్టెప్ చేయడంతో దానిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించింది. దీంతో కోహ్లీ సైతం నవ్వుతూ మళ్లీ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయాడు. కానీ, 37 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ రూపంలో రాహుల్ ని దురదృష్టం వెంటాడింది.
IND vs AUS: భారీ ఎదురుదెబ్బ.. కీలక వికెట్ సమర్పించుకున్న టీమిండియా
Updated Date - Dec 06 , 2024 | 01:17 PM