IND vs NZ: ఓటమి అంచున భారత్.. జడేజా ఒంటరి పోరాటం
ABN, Publish Date - Oct 26 , 2024 | 03:43 PM
టీమిండియా వికెట్లను వరుస పెట్టి తీసిన కివీస్ మరింత ఉత్సాహంతో ఆడుతోంది. భారత్ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే.
పూణె: 359 పరుగుల ఛేదనలో మొత్తం ఎనిమిది వికెట్లను భారత్ చేజార్చుకుంది. రవిచంద్రన్ ను పెవిలియన్ కు పంపిన మిచెల్ శాంట్నర్ అదే జోరు కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్ 5, గ్లెన్ ఫిలిప్స్ ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259, భారత్ 156 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 255 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
ఆకాశ్ దీప్ తో రవిచంద్రన్ అశ్విన్ కలిసి ఉన్నారు. పరుగుల ఛేదనలో ఎనిమిది వికెట్లు కోల్పోయిన భారత్ ఓటమి అంచున ఉంది. జడేజా క్రీజులో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. లంచ్ బ్రేక్ అనంతరం భారత్ వరుసగా శుభ్‌మన్ గిల్ (23), యశస్వి జైస్వాల్ (77), రిషభ్ పంత్ (0), విరాట్ కోహ్లీ (17), సర్ఫరాజ్ ఖాన్ (9), వాషింగ్టన్ సుందర్ (21) వికెట్లను చేజార్చుకుంది. భారత్ విజయానికి ఇంకా 181 పరుగులు చేయాల్సి ఉంది.
IND vs NZ: పంత్ డకౌట్.. విరాట్ కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్
Updated Date - Oct 26 , 2024 | 03:44 PM