ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs Aus: ప్రాక్టీస్ సెషన్‌లో దొరికిపోయిన క్రికెటర్.. ఇన్నాళ్లూ ఎలా మేనేజ్ చేశాడబ్బా

ABN, Publish Date - Nov 15 , 2024 | 07:04 PM

ఆసిస్ తో మ్యాచ్ ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ల ప్రాక్టీస్ మ్యాచ్ చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కరుగా తమ పేలవ పదర్శనతో అభిమానుల ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నారు.

sarfaraj khan

పెర్త్: కంగారూలతో కీలక మ్యాచ్ ముంగిట భారత ఆటగాళ్ల సన్నద్ధతను బీసీసీఐ పరీక్షిస్తోంది. ఈ మేరకు భారత ఎ జట్టు ఆటగాళ్లతో వార్మప్ మ్యాచ్‌లను ఆడిస్తోంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్ వంటి కీలక ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచుల్లోనే పేలవ ప్రదర్శనతో షాకిచ్చారు. తాజాగా ఇంకో టీమిండియా క్రికెటర్ ప్రదర్శన చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.


షార్ట్ బంతులను ఆడలేక..

వాకా స్టేడియం గ్రౌండ్లో నెట్ సెషన్స్ సందర్భంగా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ప్రదర్శన పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. పిచ్ బౌన్స్ ను ఎదుర్కోవడానికి కూడా సర్ఫరాజ్ తీవ్రంగా శ్రమించాడు. షార్ట్ బంతులను ఆడేందుకు ఇబ్బందిపడ్డాడు. ఆఫ్ స్టంప్ వెలుపల బంతులను ఆడినందుకు తనకు తానే అపరాధభావంతో ఉన్నట్టు కనిపించాడు. అసలీ క్రికెటర్ ముందెప్పుడైనా భారత్ వెలుపల ఆడాడా అనే సందేహం కలిగేలా అతడి ప్రదర్శన ఉన్నట్టు సమాచారం.


వచ్చీ రావడంతోనే వార్తల్లోకి..

27 ఏళ్ల సర్ఫరాజ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. రావడంతోనే వరుస సెంచరీలతో మెరిశాడు. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టుల్లో సూపర్ సెంచరీ బాది అభిమానులను ఉర్రూతలూగించాడు. ఆ తర్వాత మాత్రం మునుపటి ఫామ్‌ను అందుకోవడంలో ఇబ్బంది‌పడ్డాడు. ఆ సెంచరీ తర్వాత ఏడు ఇన్నింగ్స్ ల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో సరిపెట్టుకున్నాడు.


పెర్త్‌లో ఈ నెల 22 నుంచి జరిగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లోని మొదటి టెస్టు కోసం భారత్ అధికారికంగా తమ సన్నాహాలను ప్రారంభించింది. సీక్రెట్ గా ప్రాక్టీస్ సెషన్స్ ను కొనసాగిస్తోంది. ఈ మ్యాచ్ లకు అభిమానులను, బయటివారికి అనుమతినివ్వడం లేదు. మ్యాచ్ ను, ఆటగాళ్లను ఫొటోలు, వీడియోలు తీయడం కూడా నిషేధించారు.

Champions Trophy: పీవోకే టార్గెట్‌గా భారత్ పై కవ్వింపు చర్యలు.. పీసీబీ ప్లాన్‌ను తిప్పికొట్టిన ఐసీసీ..


Updated Date - Nov 15 , 2024 | 07:06 PM