ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

INDW vs SAW: దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. భారత్ సంచలన విజయం

ABN, Publish Date - Jul 01 , 2024 | 05:08 PM

బెంగళూరులోని చెపాక్ స్టేడియం వేదికగా.. దక్షిణాఫ్రికా మహిళత జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సంచలన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 37 పరుగుల లక్ష్యాన్ని..

India W vs South Africa W

బెంగళూరులోని చెపాక్ స్టేడియం వేదికగా.. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో (South Africa Women) జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు (India Women) సంచలన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 37 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.2 ఓవర్లలోనే పూర్తి చేసి.. 10 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. బౌలర్లతో పాటు బ్యాటర్లు సమిష్టిగా రాణించడం వల్లే.. సౌతాఫ్రికాను మట్టికరిపించి, ఈ చారిత్రాత్మక విజయాన్ని భారత్ కైవసం చేసుకుంది. స్పిన్నర్ స్నేహ్ రాణా ఏకంగా 10 వికెట్లు పడగొట్టి, ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది.


తొలి ఇన్నింగ్స్

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు స్కోరు (603/6) నమోదు చేసింది. షెఫాలి వర్మ (205) ద్విశతకంతో దుమ్ముదులిపేయడం, స్మృతి మందాన (149) శతక్కొట్టడంతో పాటు రిచా (86), హర్మన్‌ప్రీత్ (69), రోడ్రిగ్స్ (55) అర్థశతకాలతో రాణించడం వల్ల.. భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసింది. భారీ స్కోరు అనంతరం భారత జట్టు డిక్లేర్ ప్రకటించాక.. సౌతాఫ్రికా రంగంలోకి దిగింది. మొదట్లో సౌతాఫ్రికా శుభారంభమే చేసింది. కానీ.. స్నేహ్ రాణా దెబ్బకు పేకమేడలా కుప్పకూలింది. కేవలం 266 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆమె 8 వికెట్లు పడగొట్టి, సౌతాఫ్రికా బ్యాటింగ్ పతనాన్ని శాసించింది. దీంతో.. ఆ జట్టు ఫాలోఆన్ ఆడింది.


రెండో ఇన్నింగ్స్

రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా జట్టు మొదట్లో పటిష్టంగానే కనిపించింది. మొదట్లో 16 పరుగులకే వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత లారా వోల్వార్ట్ (122), సునే లూస్ (109) శతకాలతో చితక్కొట్టారు. రెండో వికెట్‌కి వీళ్లు 196 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో, సఫారీలు క్రమంగా వికెట్లు కోల్పోయారు. మిడిలార్డర్‌లో నాడిన్ డిక్లెర్క్‌ (61) ఒక్కరే అర్థశతకంతో రాణించింది. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో.. 373 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. భారత్ లక్ష్యం 37గా నిర్దేశించబడింది. అనంతరం లక్ష్య ఛేధనలో భాగంగా.. షఫాలీ వర్మ (24), శుభా సతీష్ (13) జట్టుని విజయతీరాలకు చేర్చారు.


స్కోర్లు:

భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 603/6d

సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్: 266 (ఆలౌట్)

సౌతాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్: 373 (ఆలౌట్)

భారత్ సెకండ్ ఇన్నింగ్స్: 37/0

(10 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం)

Updated Date - Jul 01 , 2024 | 05:08 PM

Advertising
Advertising