ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs Afghanistan: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్ రంగంలోకి!

ABN, Publish Date - Jan 14 , 2024 | 06:53 PM

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఆదివారం భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. హోల్కర్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో..

India vs Afghanistan: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఆదివారం భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. హోల్కర్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్ రంగంలోకి దిగింది. ఇదివరకే జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయకేతనం ఎగురవేయడంతో, రెండో మ్యాచ్‌లోనూ అదే దూకుడు కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ కైవసం చేసుకొని, సిరీస్ నెగ్గాలని అనుకుంటోంది. అటు.. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆఫ్ఘన్, ఈసారి ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలన్న కసితో బరిలోకి దిగుతోంది. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరు తమ సత్తా చాటుతారో చూడాలి.


కాగా.. ఈ మ్యాచ్‌కి గాను భారత జట్టులో రెండు మార్పులు చేశారు. శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మను పక్కన పెట్టేసి.. విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. విరాట్ కోహ్లీ రాకతో టీమిండియా మరింత పటిష్టమైంది. అయితే.. సంజు శాంసన్‌కి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. తొలి మ్యాచ్‌లో పక్కన పెట్టేన అతడ్ని, రెండో మ్యాచ్‌లోనూ తీసుకోలేదు. జితేశ్ శర్మనే వికెట్ కీపర్‌గా రంగంలోకి దిగాడు.

భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబె, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్‌షప్ సింగ్, ముకేశ్ కుమార్.

Updated Date - Jan 14 , 2024 | 06:53 PM

Advertising
Advertising