ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసిందోచ్.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

ABN, Publish Date - Feb 20 , 2024 | 08:53 PM

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premiere League) 17వ ఎడిషన్‌ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభం కానుందని, మ్యాచ్‌లన్నీ భారతదేశంలోనే నిర్వహించబడతాయని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్(Arun Dhumal) మంగళవారం స్పష్టం చేశారు. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి మార్చి 22న ముహూర్తం ఖరారు చేయాలని తాము చూస్తున్నామని ఆయన చెప్పారు.

తొలి 10 రోజుల షెడ్యూల్‌ని ముందుగా ప్రకటిస్తామని.. మిగిలిన మ్యాచ్‌ల జాబితాను సార్వత్రిక ఎన్నికల తేదీలను ఖరారు చేశాక వెల్లడిస్తామని అరుణ్ అన్నారు. ముందుగానే పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తే.. నిర్దిష్ట వేదికలకు భద్రతా వ్యవహారాల్లో ఆటంకాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అప్పుడు వేదికను మార్చాలంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. తెరవెనుక ఎన్నో యంత్రాంగాలు పని చేస్తామని, ప్రతి ఐపీఎల్ గేమ్ నిర్వహించడానికి వారికి సమయం కావాలని తెలిపారు. కాబట్టి.. షెడ్యూల్ చేయబడిన మొదటి కొన్ని గేమ్‌లను మాత్రమే ప్రకటిస్తామని, నిర్దిష్ట తేదీల్లో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయనే దానిపై స్పష్టత వచ్చాకే పూర్తి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు.

కాగా.. లోక్‌సభ ఎన్నికల తేదీలను మార్చి 13 తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ప్రభావం మ్యాచ్‌లపై పడే అవకాశం ఉంది కాబట్టి, ఈ లీగ్‌ను ఓవర్సీస్‌లో నిర్వహించే అవకాశం ఉందా? అనే ప్రశ్న అరుణ్‌కి ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అందుకు అవకాశమే లేదని, మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. అందుకే లోక్‌సభ ఎన్నికల తేదీల కోసం ఎదురుచూస్తున్నామని, వాటికి అనుగుణంగా వేదకల్ని ప్లాన్ చేస్తామని చెప్పారు.

Updated Date - Feb 20 , 2024 | 08:53 PM

Advertising
Advertising