Newzealand: కొకైన్ తీసుకుని మ్యాచ్ ఆడి.. అడ్డంగా బుక్కైన క్రికెటర్..
ABN, Publish Date - Nov 18 , 2024 | 03:47 PM
మెరుపు వేగంతో ప్రదర్శన చేసి ప్రత్యర్థి జట్టుకు దడ పుట్టించిన క్రికెటర్ ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కొకైన్ సేవించినట్టుగా తేలాడు.
న్యూజిలాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ డగ్ బ్రేస్ వెల్ చిక్కుల్లో పడ్డాడు. కొకైన్ వినియోగం నిర్ధారణ కావడంతో అతడిని జట్టు నుంచి నెల రోజుల పాటు బ్యాన్ చేశారు. ఈ ఏడాది జనవరిలో సెంట్రల్ స్టాగ్స్, వెల్లింగ్టన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ 34 ఏళ్ల క్రికెటర్ నిషేధిత మత్తు పదార్థం ప్రభావానికి గురైనట్టుగా గుర్తించారు. అయితే, ఈ మ్యాచ్లో బ్రేస్ వెల్ మెరుపు వేగంతో ప్రదర్శన చేశాడు. 21 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. 11 బంతులలో 30 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ ను గెలుచుకున్నాడు.
మ్యాచ్ అనంతరం స్పోర్ట్స్ ఇంటిగ్రిటీ కమిషన్ పరీక్షలు నిర్వహించగా ఈ ఫాస్ట్ బౌలర్ కు పాజిటివ్ వచ్చింది. అయితే, బ్రేస్ వెల్ ఈ మ్యాచ్ కు ముందురోజున మత్తు పదార్థాలు సేవించాడని మ్యాచ్ రోజున కాదని కమిటీ విశ్వసించడంతో మూడు నెలల బ్యాన్ నెల రోజులకు కుదించారు. ఏప్రిల్ 2024 నాటి మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి బ్రేస్ వెల్ కు ఒక నెల శిక్ష విధించారు. అతను మార్చి లో తన చివరి హోమ్ మ్యాచ్ ఆడాడు. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ తో శిక్ష విధించడంతో అతనిపై సస్పెన్షన్ పూర్తైంది. మరోసారి క్రికెట్ లో పాల్గొనవచ్చని కమిషన్ పేర్కొంది.
Cheteshwar Pujara: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు పుజారా.. కానీ సూపర్ ట్విస్ట్
Updated Date - Nov 18 , 2024 | 03:48 PM