IND vs NZG: కివీస్‌తో మ్యాచ్.. అశ్విన్ పేరిట వరల్డ్ రికార్డ్
ABN, Publish Date - Oct 24 , 2024 | 12:45 PM
న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా క్రికెటర్ ఆర్ అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆసీస్ బౌలర్ నాథన్ లైయన్ రికార్డును ఈ మ్యాచ్ తో బద్దలుకొట్టాడు.
పూణె: న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సీరిస్ రెండో మ్యాచ్ సందర్భంగా టీమిండియా క్రికెటర్ ఆర్. అశ్విన్ రేర్ ఫీట్ ను అందుకున్నాడు. ఆసీస్ బౌలర్ నాథన్ లైయన్ రికార్డును ఈ మ్యాచ్ తో బద్దలుకొట్టాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు ఆసీస్ బౌలర్ నాథన్ లైయన్ (187)ను అగ్రస్థానంలో ఉన్నాడు. తాజాగా అశ్విన్ ఈ రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం అశ్విన్ 188 వికెట్లు ముందున్నాడు. వీరిద్దరి తర్వాత పాట్ కమిన్స్ (175), మిచెల్ స్టార్క్ (147) ఉన్నారు. వీరిద్దరూ ఆసీస్ ప్లేయర్లే కావడం గమనార్హం.
అద్భుతమైన ఫామ్ లో అశ్విన్
2019లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రవేశపెట్టినప్పటి నుండి అశ్విన్ 39 మ్యాచ్‌లలో 20.71 సగటుతో 188 వికెట్లు సాధించాడు. నాథన్ లియాన్ డబ్ల్యూటీసీలో 26.70 సగటుతో 47 మ్యాచ్‌లలో 187 వికెట్లు సాధించాడు. బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్న ఆర్ అశ్విన్, మొదటి సెషన్‌లో రెండు వికెట్లు తీసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు తొలి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
IND vs NZ: ఆ భయం టీమిండియాను వెంటాడుతోంది.. అందుకే జట్టులో మార్పులు
Updated Date - Oct 24 , 2024 | 12:49 PM