ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shikhar Dhawan: శిఖర్ ధావన్ కు ఏమైంది.. ఆందోళనలో అభిమానులు

ABN, Publish Date - Oct 25 , 2024 | 01:30 PM

తనకు ఎవరైరనా సాయం చేయాలంటూ శిఖర్ ధావన్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Shikhar Dhawan

ముంబై: ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. తన ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటూ అప్ డేట్స్ షేర్ చేసుకుంటుంటాడు. తాజాగా శిఖర్ చేసిన పోస్ట్ పై నెట్టింట చర్చ నడుస్తోంది. ’నాకు నిద్ర పట్టడం లేదు ఎవరైనా సాయం చేయండి‘ అంటూ శిఖర్ పోస్ట్ చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు శిఖర్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఇంతకు నీకు ఏమైంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఇంతకీ శిఖర్ ను నిద్రపోనీయకుండా చేస్తున్న ఆ సమస్య ఏమిటనేది తెలియడంలేదు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా పోరాడాలంటూ సాడ్ ఎమోజీలను నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ధావన్ పోస్ట్ కు ఫన్నీ మీమ్ వీడియోలను షేర్ చేస్తూ అతడిని ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రికెటర్ చివరగా లడ్డూ బాబా రీల్ ను షేర్ చేశాడు.


అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధావన్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ)లో చేరాడు, గుజరాత్ గ్రేట్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమణ పొందడం అతడిని ఐపీఎల్ వైపు నడిపించింది. ధావన్ క్రికెట్ కెరీర్‌లో భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు , 68 టీ20ల్లో 12,286 పరుగులు చేశాడు.

Updated Date - Oct 25 , 2024 | 01:31 PM