ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sourav Ganguly: హెడ్ కోచ్ పదవిపై సౌరవ్ గంగూలీ ట్వీట్.. మెలిక పెట్టేశాడుగా!

ABN, Publish Date - May 30 , 2024 | 10:16 PM

ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది. దీంతో.. కొత్త కోచ్‌ని ఎంపిక చేసే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది. అయితే.. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్..

ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది. దీంతో.. కొత్త కోచ్‌ని ఎంపిక చేసే పనిలో బీసీసీఐ (BCCI) నిమగ్నమైంది. అయితే.. హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhi) నియామకం దాదాపు ఖరారు అయ్యిందనే వాదనలు క్రీడా వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అటు.. అశిశ్ నెహ్రాతో (Ashish Nehra) పాటు కొందరు విదేశీ కోచ్‌లు సైతం ఈ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.


ఇలాంటి తరుణంలో.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఓ ఆసక్తికర పోస్టు చేశాడు. హెడ్ కోచ్ పదవి ఎంతో కీలకమైందని, అలాంటి పదవి కోసం ఎంపిక చేసేటప్పుడు తెలివిగా ప్రదర్శించాలని పేర్కొన్నాడు. ‘‘కోచ్ పదవి అనేది ఒక ఆటగాడి జీవితంలో ఎంతో కీలకమైంది. మార్గదర్శిగా, కనికరం లేని శిక్షణతో.. ఆటగాళ్లను మైదానంలో అత్యుత్తమ ప్లేయర్‌గా మార్చాల్సిన బాధ్యత కోచ్‌పై ఉంటుంది. కాబట్టి.. కోచ్‌ ఎంపిక చేసే విషయంలో తెలివిగా వ్యవహరించండి’’ అని గంగూలీ తన పోస్టులో చెప్పుకొచ్చాడు. ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంగూలీ మంచి సలహా ఇచ్చాడని కొందరు అంటుంటే.. ఎవరినైనా ఉద్దేశించి ఈ పోస్టు పెట్టాడా? అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. హెడ్ పదవి కోసం దరఖాస్తుల గడువు మే 27వ తేదీతోనే ముగిసింది. ఏకంగా మూడు వేల మంది ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. అయితే.. వాటిల్లో కొన్ని ఫేక్ దరఖాస్తులు కూడా ఉన్నాయి. అయితే.. దేశవాళీ క్రికెట్‌పై లోతైన అవగాహన ఉన్న భారతీయుడినే హెడ్ కోచ్‌గా నియమించే అవకాశం ఉందని బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పడంతో, ఆ భారతీయుడు ఎవరై ఉంటాడా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - May 30 , 2024 | 10:16 PM

Advertising
Advertising