ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heinrich Klassen: టెస్ట్ ఫార్మాట్‌కు మరో స్టార్ ఆటగాడు గుడ్‌బై..!!

ABN, Publish Date - Jan 08 , 2024 | 05:00 PM

Heinrich Klassen: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ బాటలో మరో స్టార్ ఆటగాడు నడిచాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్య రీతిలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు.

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ బాటలో మరో స్టార్ ఆటగాడు నడిచాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్య రీతిలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. రెడ్ బాల్ క్రికెట్‌కు గుడ్‌బై పలకాలని ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు క్లాసెన్ తెలిపాడు. ఇది చాలా కష్టమైన నిర్ణయం అని.. క్రికెట్‌లో తనకు ఇష్టమైన ఫార్మాట్ ఇదే అయినా తప్పడం లేదని పేర్కొన్నాడు. మైదానం లోపల, వెలుపల చేసిన పోరాటాలతో క్రికెటర్‌గా మారానని.. ఇదో గొప్ప ప్రయాణంగా క్లాసెన్ అభివర్ణించాడు. తన దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు ఎంతో సంతోషంగా ఉందని.. తన ప్రయాణంలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రస్తుతానికి కొత్త సవాల్ కోసం ఎదురుచూస్తున్నట్లు క్లాసెన్ చెప్పాడు.

దక్షిణాఫ్రికా తరఫున హెన్రిచ్ క్లాసెన్ కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు. 2019లో భారత పర్యటనలో క్లాసెన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రాంచీ వేదికగా జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులే చేశాడు. తర్వాత రెండో టెస్టు ఆడేందుకు నాలుగేళ్లు ఎదురుచూశాడు. 2023లో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టులు ఆడేందుకు అవకాశం వచ్చినా పెద్దగా రాణించలేదు. మొత్తంగా టెస్ట్ కెరీర్‌లో క్లాసెన్ 105 పరుగులు మాత్రమే సాధించాడు. అత్యధిక స్కోరు 35. కాగా టీ20 లీగ్ కోసం దక్షిణాఫ్రికా బోర్డు టెస్టు ఫార్మాట్‌ను విస్మరించిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో క్లాసెన్ రెడ్ బాల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 05:00 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising