ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mike Tyson vs Jake Paul: టైసన్ దెబ్బకు.. నెట్‌ఫ్లిక్స్ క్రాష్.. ఇంత దారుణమా అంటూ ఫ్యాన్స్ గగ్గోలు

ABN, Publish Date - Nov 16 , 2024 | 01:40 PM

ఈ మ్యాచ్‌ను చూసేందుకు దాదాపు 70 వేల మంది అభిమానులు వచ్చారు. దీంతో టికెట్లు దొరకని వారంతా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌నే నమ్ముకున్నారు.

Netflix

లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ రీ ఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురుచూసిన అభిమానులు భారీ నిరాశలో కూరుకుపోయారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సీనియర్ బాక్సర్ ను ఓ యూట్యూబర్ ఓడించాడు. టైసన్ శరీరం, ముఖంపై బలమైన పంచ్‌లను విజృంభించిన పాల్.. మ్యాచ్‌ను 78-74 తేడాతో గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ దెబ్బకు ప్రముఖ ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ క్రాష్ అయ్యింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టైసన్ తిరిగి రింగ్ లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఈ మ్యాచ్ కు ముందు భారీ బజ్ క్రియేట్ అయ్యింది. దీన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన నెట్ ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ షోను లైవ్ స్ట్రీమింగ్ చేసే బాధ్యతలను తీసుకుంది. అయితే, నాసిరకం సేవలు అందించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


మ్యాచ్ ఫ్రీగా చూడొచ్చని వస్తే..

ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించడంతో ఒక్కసారిగా సర్వర్ డౌన్ అయ్యింది. టెక్సాస్‌లోని ఎటి అండ్ టి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు దాదాపు 70 వేల మంది అభిమానులు వచ్చారు. దీంతో టికెట్లు దొరకని వారంతా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌నే నమ్ముకున్నారు. వాస్తవానికి నెట్ ఫ్లిక్స్ ఈ ఈవెంట్ మొత్తాన్ని అండర్ కార్డులతో సహా ప్రసారం చేసింది. అయినప్పటికీ మ్యాచ్ పై అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఈ సంస్థ యాప్ , వెబ్ సైట్‌లన్నీ వరల్డ్ వైడ్ గా క్రాష్ అయ్యాయి. మ్యాచ్ లైవ్ చూద్దామని వచ్చిన ఆడియెన్స్‌కు మాటిమాటికీ బఫరింగ్ రావడం మొదలైంది. ఆడియో కూడా పలు మార్లు వినిపించకపోవడంతో మ్యాచ్ చూసే ఉత్సాహం పోయిందంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు.


టైసన్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

19 ఏళ్ల తర్వాత టైసన్ తొలిసారి బాక్సింగ్ పోటీలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చివరి సారిగా 2005లో ఐరిష్ ఆటగాడు కెవిన్ మైక్ బ్రైడ్ చేతిలో టైసన్ ఓటమిపాలయ్యాడు. టికెట్ సేల్స్ ద్వారానే 17.5 మిలియన్ డాలర్ల వరకు వచ్చాయని సమాచారం. ఈ పోటీలో పాల్గొనేందుకు టైసన్‌కు ఏకంగా 20 మిలియన్ డాలర్లను చెల్లించినట్టు తెలుస్తోంది. మైక్ టైసన్ ఆరోగ్యం ప్రస్తుతం బాగోలేదని ఈ మ్యాచ్ కు ముందే వైద్యులు హెచ్చరించారు. ఈ సందర్భంగా టైసన్ తలకు గాయాలైతే అది అతని ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు. అయినా టైసన్ ఆడటానికే నిర్ణయించుకున్నాడు. 1987 నుంచి 1990 వరకు బాక్సింగ్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఈ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ తాజా ఓటమి అభిమానులను బాధిస్తోంది.

Pakistan Cricket Team: పాకిస్థాన్‌ పరువు పాయె..


Updated Date - Nov 16 , 2024 | 03:30 PM