India vs Zimbabwe: టాస్ గెలిచిన భారత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
ABN, Publish Date - Jul 07 , 2024 | 04:43 PM
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వే, భారత్ జట్ల మధ్య రెండో మ్యాచ్ ఆదివారం ఆడుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచింది. దీంతో.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్...
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వే, భారత్ జట్ల మధ్య రెండో మ్యాచ్ ఆదివారం ఆడుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచింది. దీంతో.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లో ఎదుర్కొన్న ఘోర పరాభావానికి గాను విమర్శలు రావడంతో.. ఆటతోనే గట్టి సమాధానం ఇవ్వాలని భారత్ భావిస్తోంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకొని, విమర్శకుల నోళ్లు మూయించాలని అనుకుంటోంది. మరోవైపు.. తొలి మ్యాచ్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న జింబాబ్వే, అదే దూకుడు కొనసాగించాలని అనుకుంటోంది. భారత్‌పై ఆధిపత్యం చెలాయించి, చిన్న జట్టు అని తమపై ఉన్న అపవాదుని తొలగించుకోవాలని చూస్తోంది. మరి.. హోరాహోరీగా సాగనున్న ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
తుది జట్లు
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్.
జింబాబ్వే: వెస్లీ మద్వీర, ఇన్నోసెంట్ కైయా, బ్రియన్ బెనెట్, సికిందర్ రజా (కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మండాడే (వికెట్ కీపర్), మసకద్జ, జాంగ్వి, ముజరబాని, చటార.
Updated Date - Jul 07 , 2024 | 04:43 PM