ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

India vs Zimbabwe: టాస్ గెలిచిన జింబాబ్వే.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ABN, Publish Date - Jul 14 , 2024 | 04:18 PM

ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌లో భాగంగా.. చివరిదైన ఐదో మ్యాచ్‌లో తలపడేందుకు జింబాబ్వే, భారత జట్లు సిద్ధమయ్యాయి. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్..

ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్‌లో భాగంగా.. చివరిదైన ఐదో మ్యాచ్‌లో తలపడేందుకు జింబాబ్వే, భారత జట్లు సిద్ధమయ్యాయి. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత్ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ సిరీస్‌ని 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనా.. ఆ తర్వాత వరుసగా మూడు విజయాలు నమోదు చేసి సిరీస్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే దూకుడులో.. చివరి మ్యాచ్‌లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించి, విజయఢంకా మోగించాలని చూస్తోంది.


మరోవైపు.. తాము సిరీస్ కోల్పోయినప్పటికీ, తమ పరువు కాపాడుకోవడం కోసం చివరి మ్యాచ్‌లో గెలుపొందాలని జింబాబ్వే భావిస్తోంది. భారత్‌ని గట్టి పోటీనిచ్చి, తమ సత్తా చాటాలని అనుకుంటోంది. అందుకే.. టాస్ గెలిచి మరీ, ఫీల్డింగ్ ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది. మరి.. ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇదిలావుండగా.. టీమిండియా మేనేజ్‌మెంట్ జట్టులో రెండు మార్పులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్‌లను కూర్చోబెట్టి.. వారి స్థానంలో రియాన్ పరాగ్, ముకేశ్‌ కుమార్‌లను తీసుకుంది.

తుది జట్లు

భారత్: యశస్వీ, శుభ్‌మన్ (కెప్టెన్), అభిషేక్, రియాన్, సంజూ (కీపర్), రింకూ, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్, ముకేశ్

జింబాబ్వే: వెస్లీ, మారుమణి, బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), క్యాంప్‌బెల్, మైయర్స్, క్లైవ్ మదండే (కీపర్), ఫరాజ్, ముజరబాని, రిచర్డ్, బ్రాండన్

Updated Date - Jul 14 , 2024 | 04:18 PM

Advertising
Advertising
<