మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sara Tendulkar: శుభ్‌మన్ గిల్-సారా తమ ప్రేమను కన్ఫామ్ చేస్తున్నారా? తాజాగా షేర్ చేసిన ఫోటో చూస్తే..

ABN, Publish Date - Mar 08 , 2024 | 07:48 PM

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా, టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని మీడియా కోడై కూస్తోంది.

Sara Tendulkar: శుభ్‌మన్ గిల్-సారా తమ ప్రేమను కన్ఫామ్ చేస్తున్నారా? తాజాగా షేర్ చేసిన ఫోటో చూస్తే..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా (Sara Tendulkar), టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ప్రేమాయణం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని మీడియా కోడై కూస్తోంది. అయితే ఆ ప్రేమ వార్తల గురించి అటు గిల్ గాని, ఇటు సారా గాని ఇప్పటివరకు స్పందించలేదు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో కావటం, ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్స్ పెడుతుండడంతో ఎప్పటికప్పుడు వీరి రిలేషన్ షిప్‌పై వార్తలు వస్తూనే ఉంటాయి.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సారా (Sara Instagram) షేర్ చేసిన ఓ ఫొటో వీరి రిలేషన్‌ను మరోసారి లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చింది. తాజాగా షేర్ చేసిన ఫొటోలో సారా ఓ కుక్కతో ఉంది. కొద్ది రోజుల క్రితం గిల్ పోస్ట్ చేసిన ఫొటోలో కూడా అదే కుక్క ఉంది. దీంతో వారిద్దరి దగ్గర ఉన్నది ఒకే కుక్క అని, నిజంగానే వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని మరోసారి రూమర్లు మొదలయ్యాయి. నిజానికి గిల్‌కు కుక్కలంటే చాలా ప్రేమ. పెంపుడు కుక్కలతో తీసుకున్న ఫొటోలను గిల్ తరచుగా పోస్ట్ చేస్తుంటాడు.

తన దగ్గర ఉన్న కుక్కల్లో ఒక దానిని సారాకు గిఫ్ట్‌గా ఇచ్చి ఉంటాడని సోషల్ మీడియా జనాలు కామెంట్లు చేస్తున్నారు. గిల్, సారా బ్రేకప్ చెప్పేసుకున్నారని గతేడాది వార్తలు వచ్చాయి. సారాకు బ్రేకప్ చెప్పిన గిల్ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌‌తో కలిసి తిరుగుతున్నాడని పుకార్లు వచ్చాయి. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది కేవలం పుకారుగానే మిగిలిపోయింది.

Updated Date - Mar 08 , 2024 | 07:48 PM

Advertising
Advertising