ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T20 Worldcup: పాకిస్తాన్‌లో మీ టైమ్ వేస్ట్ చేసుకోకండి.. హెడ్ కోచ్ గ్యారీ కీర్‌స్టన్‌కు హర్భజన్ సూచనలు!

ABN, Publish Date - Jun 18 , 2024 | 12:54 PM

టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పాకిస్తాన్ దారుణ ప్రదర్శన కనబరిచింది. అమెరికా వంటి పసికూన చేతిలో కూడా ఓటమి పాలై లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై ఆ దేశ అభిమానులు, మాజీలు విమర్శలు కురిపిస్తున్నారు. పాకిస్తాన్ హెడ్ కోచ్ గ్యారీ కీర్‌స్టెన్‌కు కూడా విమర్శల తాకిడి తప్పడం లేదు.

Gary Kirsten fires on pakistan cricket team

టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పాకిస్తాన్ (Pakistan Cricket Team) దారుణ ప్రదర్శన కనబరిచింది. అమెరికా వంటి పసికూన చేతిలో కూడా ఓటమి పాలై లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై ఆ దేశ అభిమానులు, మాజీలు విమర్శలు కురిపిస్తున్నారు. పాకిస్తాన్ హెడ్ కోచ్ గ్యారీ కీర్‌స్టెన్‌ (Gary Kirsten)కు కూడా విమర్శల తాకిడి తప్పడం లేదు. ఇప్పటికే ఆయన పాక్ జట్టు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆ దేశ మీడియాలో వార్తలు వచ్చాయి.


``పాకిస్తాన్ జట్టులో అస్సలు ఐక్యతే లేదు. అది దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టే కాదు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ను ఒక టీమ్‌ అని పిలవడం కూడా తప్పే. జట్టులోని సభ్యులు గ్రూపులుగా విడిపోయారు. ఒకరితో ఒకరికి సంబంధాలు లేవు. నా కెరీర్లో చాలా జట్లతో కలిసి పని చేశాను. కానీ, ఇలాంటి పరిస్థితులు ఎక్కడా చూడలేదు. పాక్ ఆటగాళ్లు ఫిట్‌నెస్ విషయంలో చాలా పూర్`` అంటూ గ్యారీ కీర్‌స్టెన్ అన్నట్టు పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, గ్యారీ కీర్‌స్టెన్‌కు టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ (Harbhajan singh) కీలక సూచనలు చేశాడు.


``గ్యారీ కీర్‌స్టెన్ ఓ గొప్ప కోచ్. మంచి స్నేహశీలి. చాలా నిజాయితీగా ఉండే ప్రత్యేకమైన మనిషి. 2011 ప్రపంచకప్ జట్టులోని సభ్యులందరికీ గ్యారీ మంచి స్నేహితుడు. గ్యారీ.. పాకిస్తాన్‌లో నీ టైమ్ వేస్ట్ చేసుకోకు. టీమిండియాకు హెడ్ కోచ్‌గా పనిచేసేందుకు మళ్లీ రా`` అంటూ హర్భజన్ పేర్కొన్నాడు. 2011లో భారత్ ప్రపంచకప్ గెలిచినపుడు గ్యారీ హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. ఆ జట్టులో హర్భజన్ సభ్యుడు. కాగా, 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ జట్టు హెడ్ కోచ్‌గా గ్యారీ బాధ్యతలు స్వీకరించాడు.

ఇవి కూడా చదవండి..

T20 World Cup 2024: ఒకే ఓవర్‌లో 36 పరుగులు.. టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం


Babar Azam-Sehwag: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 18 , 2024 | 12:54 PM

Advertising
Advertising