India vs England: హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్‌కు తుది జట్టుని ప్రకటించిన ఇంగ్లండ్
ABN, Publish Date - Jan 24 , 2024 | 05:21 PM
భాగ్యనగరం హైదరాబాద్ వేదికగా గురువారం మొదలు కానున్న తొలి టెస్టు మ్యాచ్ ఇంగ్లండ్ టీమ్ తుది జట్టుని ప్రకటించింది. మొత్తం నలుగురు స్పిన్నర్లకు ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశమిచ్చింది. 24 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీకి అరంగేట్రం చేయబోతున్నాని ప్రకటించింది.
హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్ వేదికగా గురువారం మొదలు కానున్న తొలి టెస్టు మ్యాచ్ ఇంగ్లండ్ టీమ్ తుది జట్టుని ప్రకటించింది. మొత్తం నలుగురు స్పిన్నర్లకు ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశమిచ్చింది. 24 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీకి అరంగేట్రం చేయబోతున్నాని ప్రకటించింది. హార్ట్‌లీ, రెహాన్ అహ్మద్, జాక్ లీచ్‌తో పాటు జో రూట్ జట్టులో నాల్గవ స్పిన్నర్‌గా ఉంటాడని తెలిపింది. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. దీంతో మార్క్ వుడ్ రూపంలో ఒక పేసర్‌ను మాత్రమే జట్టులోకి తీసుకుంది.
కాగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గురువారం తొలి టెస్ట్ మొదలుకానుంది. గురువారం మ్యాచ్‌లో అరంగేట్రం చేయబోతున్న టామ్ హర్ట్‌లీ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 40 వికెట్లు తీయగా అందులో ఒక 5 వికెట్ల ఫీట్ సాధించాడు. కాగా వీసా సమస్య కారణంగా ఇంగ్లండ్ ఆటగాడు షోయబ్ బషీర్ తొలి టెస్టుకు దూరమయిన విషయం తెలిసిందే.
Updated Date - Jan 24 , 2024 | 05:21 PM