ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్‌కు మీరేం నేర్పలేదు.. బెన్ డకెట్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఫైర్!

ABN, Publish Date - Feb 20 , 2024 | 09:47 PM

ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ మాత్రం జైస్వాల్ ఆటతీరుపై విచిత్రమైన కామెంట్లు చేశాడు. యశస్వి సూపర్ బ్యాటింగ్ వెనుక తమ క్రెడిట్ కూడా ఉందని వ్యాఖ్యానించి చాలా మందిని ఆశ్చర్యపరిచాడు.

యువ సంచలనం యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ (India vs England)లో వీర విహారం చేస్తున్నాడు. వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. మాజీ క్రికెట్ దిగ్గజాలు జైస్వాల్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు. అయితే ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ (Ben Duckett) మాత్రం జైస్వాల్ ఆటతీరుపై విచిత్రమైన కామెంట్లు చేశాడు. యశస్వి సూపర్ బ్యాటింగ్ వెనుక తమ క్రెడిట్ కూడా ఉందని వ్యాఖ్యానించి చాలా మందిని ఆశ్చర్యపరిచాడు.

``మాతో ఆడేటపుడు ప్రత్యర్థి జట్లు కూడా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇతర జట్ల కంటే భిన్నంగా మా ప్రత్యర్థులు టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారు. దానికి మా ఆటతీరు కూడా ఓ కారణం. కాబట్టి ప్రత్యర్థులు గొప్ప క్రికెట్ ఆడారంటే అందులో మేం కూడా కొంత క్రెడిట్ తీసుకోవాలి. జైస్వాల్ ఓ సూపర్ స్టార్ కాబోతున్నాడు. ప్రస్తుతం అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడ``ని డకెట్ అన్నాడు. తమ వల్లే జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడని అర్థం వచ్చేలా మాట్లాడిన డకెట్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ (Nasser Hussain) ఆగ్రహం వ్యక్తం చేశాడు.

``యశస్విపై డకెట్ వ్యాఖ్యలు వింటే.. అతడు ఇంగ్లండ్‌ను చూసి ఆడడం నేర్చుకున్నాడనే అర్థం వస్తోంది. అతడు మిమ్మల్నిచూసి నేర్చుకోలేదు. అతడు పెరిగిన విధానం, కష్టం అతడిని ఈ స్థాయికి తీసుకువచ్చాయి. ఐపీఎల్ కూడా అతడిని మెరుగ్గా తీర్చి దిద్దింది. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వీలైతే అతడి నుంచి మీరు నేర్చుకోవాల``ని డకెట్‌కు హుస్సేన్ చురకలంటించాడు.

Updated Date - Feb 20 , 2024 | 09:47 PM

Advertising
Advertising