ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Novak Djokovic : అయ్యో.. జొకో

ABN, Publish Date - Jun 05 , 2024 | 05:15 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అనూహ్య పరిణామం. 25వ గ్రాండ్‌స్లామ్‌ వేటలోనున్న పురుషుల డిఫెండింగ్‌ చాంప్‌, వరల్డ్‌ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ టోర్నీ నుంచి వైదొలిగాడు. కుడి మోకాలి గాయం కారణంగా జొకో క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ ఆడడం

గాయంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి అవుట్‌

సెమీ్‌సకు గాఫ్‌, స్వియటెక్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అనూహ్య పరిణామం. 25వ గ్రాండ్‌స్లామ్‌ వేటలోనున్న పురుషుల డిఫెండింగ్‌ చాంప్‌, వరల్డ్‌ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ టోర్నీ నుంచి వైదొలిగాడు. కుడి మోకాలి గాయం కారణంగా జొకో క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ ఆడడం లేదని నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. ఫ్రాన్సిస్కోతో జరిగిన ప్రీక్వార్టర్స్‌ పోరును అతికష్టమ్మీద నెగ్గిన జొకోవిచ్‌.. ఆ మ్యాచ్‌లో పలుమార్లు ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలో నొప్పితోనే ఆ మ్యాచ్‌ను కొనసాగించిన జొకో.. చివరకు ఐదుసెట్ల పాటు పోరాడి గట్టెక్కాడు. మ్యాచ్‌ తర్వాత ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్‌ తీయించగా, గాయమైనట్లు బయటపడింది. దీంతో జొకోతో క్వార్టర్‌ఫైనల్స్‌లో తలపడాల్సిన కాస్పర్‌ రూడ్‌ వాకోవర్‌తో నేరుగా సెమీఫైనల్‌ చేరాడు. క్వార్టర్స్‌కు ముందే నిష్క్రమించడంతో జొకోవిచ్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన నెంబర్‌వన్‌ స్థానాన్ని రెండోసీడ్‌ జానిక్‌ సిన్నర్‌కు కోల్పోనున్నాడు. ఇక, సిన్నర్‌ 6-2, 6-4, 7-6(3)తో దిమిత్రోవ్‌ను చిత్తుచేసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లగా.. జ్వెరెవ్‌ 4-6, 6-1, 5-7, 7-6(2), 6-2తో హోల్గర్‌ రూన్‌ను ఓడించి క్వార్టర్స్‌ చేరాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ స్వియటెక్‌, మూడోసీడ్‌ కొకొ గాఫ్‌ సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. క్వార్టర్‌ఫైనల్స్‌లో స్వియటెక్‌ 6-0, 6-2తో ఐదోసీడ్‌ వొండ్రుసోవాను ఓడించగా.. గాఫ్‌ 4-6, 6-2, 6-3తో 8వ సీడ్‌ జెబ్యూర్‌పై విజయం సాధించింది.

Updated Date - Jun 05 , 2024 | 05:15 AM

Advertising
Advertising