Ramandeep Singh: క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతమైన క్యాచ్.. వీడియో చూడండి
ABN, Publish Date - Oct 20 , 2024 | 05:17 PM
ఎమర్జింగ్ ఆసియా కప్-2024లో భారత్ జట్టు శుభారంభం చేసింది. శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎమర్జింగ్ ఆసియా కప్-2024లో భారత్ జట్టు శుభారంభం చేసింది. శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 184 పరుగుల లక్ష్య చేధనలో పాక్-ఎ జట్టు 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఇక మ్యాచ్‌లో రమణదీప్ సింగ్ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుతంగా నిలిచింది. భారత ఎ జట్టు క్రికెటర్ రమణదీప్ సింగ్ అత్యద్భుతమైన క్యాచ్ పట్టాడు. అతడు క్యాచ్ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత క్రికెట్‌లో దీన్ని అత్యుత్తమ క్యాచ్‌గా పిలుస్తున్నారు. మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ దీనిని 'గొప్ప క్యాచ్'గా అభివర్ణించారు. రమణదీప్ సింగ్ అత్యుత్తమ ఫీల్డర్‌లలో ఒకరు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అతను ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. ఫీల్డింగ్‌లో విన్యాసాలు చేయడంలో ప్రసిద్ధి చెందిన రమణదీప్ ఈసారి పాక్ జట్టును, ప్రపంచ క్రికెట్ లవర్స్‌ను ఆశ్చర్యపరిచాడు.
ఒమన్‌లోని మస్కట్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడ్ వికెట్ బౌండరీ వద్ద రన్‌దీప్ సూపర్ క్యాచ్ పట్టాడు. పాక్ ఇన్నింగ్స్ 9 ఓవర్‌లో స్పిన్నర్ నిశాంత్ సింధు తొలి బంతిని యాసిర్ ఖాన్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బాల్ వచ్చిన వేగాన్ని గమనించిన రమణ్ దీప్ గాలిలోకి డైవ్ చేశాడు. డిప్ మిడ్ వికెట్‌లో రమణ్ దీప్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అతడి విన్యాసం చూసి అందరూ షాక్ అయిపోయారు.పర్ఫెక్ట్ టైమింగ్‌తో బంతిని పట్టుకోగలిగాడు. క్యాచ్ సమయంలో అతని శరీరం మొత్తం గాలిలోనే ఉంది. ఔట్ కావడంతో పాక్ ఓపెనర్ యాసిర్ ఖాన్.. సింగ్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెట్ చరిత్రలోనే అత్యద్భుత క్యాచ్ అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..
Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..
HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
For Telangana News And Telugu News...
Updated Date - Oct 20 , 2024 | 05:17 PM