ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏడేళ్ల తర్వాత మళ్లీ హాకీ లీగ్‌

ABN, Publish Date - Oct 05 , 2024 | 02:02 AM

హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అభిమానులను అలరించనుంది. పూర్తిగా కొత్త రూపు సంతరించుకున్న పురుషులు, మహిళల హాకీ లీగ్‌ వచ్చే డిసెంబరు 28న ప్రారంభం కానుంది.

న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అభిమానులను అలరించనుంది. పూర్తిగా కొత్త రూపు సంతరించుకున్న పురుషులు, మహిళల హాకీ లీగ్‌ వచ్చే డిసెంబరు 28న ప్రారంభం కానుంది. పురుషుల విభాగంలో ఎనిమిది జట్లు, మహిళల్లో ఆరు జట్లు బరిలో దిగనున్నాయి. రూర్కేలాలో పురుషులు, రాంచీలో మహిళల పోటీలు నిర్వహిస్తారు. ఈనెల 13 నుంచి 15 వరకు ఆటగాళ్ల వేలం జరగనుంది. 2013లో తొలిసారి మొదలైన హెచ్‌ఐఎల్‌ ఐదు సంవత్సరాలు కొనసాగిన తర్వాత నిలిచిపోయింది. కాగా..హాకీ ఇండియా లీగ్‌ ఢిల్లీ ఫ్రాంచైజీ తన డైరెక్టర్‌గా దిగ్గజ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజే్‌షను శుక్రవారం ప్రకటించింది.

Updated Date - Oct 05 , 2024 | 02:02 AM