India vs Pakistan: జస్ప్రీత్ బుమ్రా సూపర్ బౌలింగ్ చూశారా? రిజ్వాన్‌ను బౌల్డ్ చేసిన బంతి మ్యాచ్‌కే హైలెట్!
ABN, Publish Date - Jun 10 , 2024 | 10:00 AM
టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఆదివారం సాయంత్రం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగి క్రికెట్ అభిమానులకు మంచి మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ-20 ప్రపంచకప్ (T20 Worldcup)లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఆదివారం సాయంత్రం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది (India vs Pakistan). ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగి క్రికెట్ అభిమానులకు మంచి మజాను అందించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
పాకిస్తాన్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిజ్వాన్ వికెట్ తీయడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. ముందుగా ఓపెన్ బాబర్ ఆజామ్‌ను బుమ్రా అవుట్ చేశాడు. అవుట్ సైడ్ వెళ్తున్న బంతి బాబర్ బ్యాట్‌కు తాకింది. స్లిప్‌లో ఉన్న సూర్య అద్భుతంగా డైవ్ చేసి దానిని అందుకున్నాడు. ఇక, పాకిస్తాన్‌ను విజయం దిశగా తీసుకెళ్తున్న రిజ్వాన్ వికెట్‌ను బుమ్రా తీయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అద్భుతమైన ఇన్ స్వింగర్‌తో రిజ్వాన్ (Mohammad Rizwan)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఇక, 19వ ఓవర్లో బుమ్రా వేసిన టాస్ బంతిని ఇఫ్తికార్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుటై వెనుదిరిగాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రాకు ``మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్`` అవార్డు దక్కింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (31 బంతుల్లో 6 ఫోర్లతో 42), అక్షర్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 20) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్లు చేశారు. ఏకంగా ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పాక్ పేసర్లు నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లకు మూడేసి, ఆమిర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓడింది. రిజ్వాన్ (31) ఒక్కడే రాణించాడు. వర్షం కారణంగా గంట ఆలస్యంగా ఈ మ్యాచ్ ఆరంభమైంది. అలాగే భారత్ తొలి ఓవర్ ముగిశాక కూడా మరో 35 నిమిషాలపాటు బ్రేక్ ఏర్పడింది.
ఇవి కూడా చదవండి..
T20 World Cup 2024: పాకిస్తాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విజయానికి కారణాలివే.. లేదంటే
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 10 , 2024 | 10:00 AM