IND vs ENG: రెండో రోజు ఇంగ్లండ్‌పై 175 పరుగుల ఆధిక్యంలో భారత్
ABN, Publish Date - Jan 26 , 2024 | 05:50 PM
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రెండు రోజులు భారత్ ఆధీక్యం కొనసాగింది. తొలి రోజు ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 246 పరుగులకే కట్టడి చేశారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది.
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య హైదరాబాద్(hyderabad)లో ఈరోజు తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. గురువారం ఒక వికెట్ నష్టానికి 119 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లకు 421 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ సెంచరీలు కోల్పోయారు. అదే సమయంలో రవీంద్ర జడేజా సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై టీమిండియా 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవీంద్ర జడేజా 81 పరుగులు, అక్షర్ పటేల్ 35 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ప్రపంచ నంబర్ 1 నొవాక్ జొకోవిచ్ ఔట్
ఉదయం ఒక వికెట్ నష్టానికి 119 పరుగుల వద్ద ఆడేందుకు బయలుదేరిన భారత జట్టు మొదటి, రెండు, మూడో సెషన్లలో రెండేసి వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జట్టు తొలి ఓవర్‌లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (80 పరుగులు) వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (23 పరుగులు) కూడా ఇన్నింగ్స్‌ను కొనసాగించలేకపోయాడు. ఇక తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (35 పరుగులు) 63 బంతుల్లో ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలోనే ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ 86 పరుగులు చేసి విజృంభించాడు. ఆ తర్వాత మూడో సెషన్‌లో కేఎస్ భరత్ 41 పరుగుల వద్ద అవుట్ కాగా, అశ్విన్ ఒక పరుగు చేసి వెనుదిరిగాడు.
Updated Date - Jan 26 , 2024 | 05:50 PM