ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

India vs Pakistan: పాకిస్తాన్ ఓటమికి ఆ ఆటగాడే కారణం.. తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్

ABN, Publish Date - Jun 10 , 2024 | 04:01 PM

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో ఓటమితో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. ఆరంభ మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఓడిన పాకిస్తాన్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియాతో తలపడి పరాజయం పాలైంది. భారత్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది.

Shoaib Malik

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌ (T20 worldcup)లో వరుసగా రెండో ఓటమితో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. ఆరంభ మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఓడిన పాకిస్తాన్ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియాతో తలపడి పరాజయం పాలైంది (India vs Pakistan). భారత్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. దీంతో ఆ జట్టుపై మాజీలు విమర్శలు కురిపిస్తున్నారు. పాకిస్తాన్ బ్యాటర్లు నెమ్మదిగా ఆడడం వల్లే ఈ ఓటమి సంభవించిందని మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్ (Shoaib Malik ) అభిప్రాయపడ్డాడు.


``కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగిన ఇమాద్ వసీమ్ (Imad Wasim) 23 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. దూకుడుగా ఆడాల్సిన సమయంలో నెమ్మదిగా ఆడి బంతులను వృథా చేశాడు. దీంతో ఒత్తిడి పెరిగిపోయి లక్ష్య ఛేదన కష్టమైపోయింది. ఇమాద్ ఏమాత్రం వేగంగా ఆడినా విజయం సాధ్యమయ్యేది. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో మొత్తం 120 బంతుల్లో 59 బాల్స్ డాట్స్‌ పడ్డాయ``ని మాలిక్ ఓ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు.


మాలిక్‌తో పాటు చర్చలో పాల్గొన్న మరో మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రీది పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబార్ ఆజామ్‌పై విమర్శలు గుప్పించాడు. ``పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం కనిపించడం లేదు. కెప్టెన్ బాబార్‌తో ఆటగాళ్లుకు సమస్యలున్నట్టు ఉన్నాయి. కెప్టెన్‌ జట్టుకు అతి కీలకమైన వ్యక్తి. మొత్తం అతడి చేతిలోనే ఉంటుంది. ఈ ప్రపంచకప్ ముగిసిన తర్వాత మొత్తం వివరాలు బయటపెడతాన``ని ఆఫ్రీది వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి..

India vs Pakistan: జస్ప్రీత్ బుమ్రా సూపర్ బౌలింగ్ చూశారా? రిజ్వాన్‌ను బౌల్డ్ చేసిన బంతి మ్యాచ్‌కే హైలెట్!


T20 World Cup: పాకిస్తాన్ ఇక ఇంటికేనా.. ఆ అద్భుతం జరిగితే తప్ప..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Read more!

Updated Date - Jun 10 , 2024 | 04:01 PM

Advertising
Advertising