IND W vs NEP W: అమ్మాయిల మజాకా.. నేపాల్‌పై భారీ తేడాతో విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
ABN, Publish Date - Jul 23 , 2024 | 10:12 PM
మహిళల ఆసియా కప్‌లో భాగంగా.. మంగళవారం నేపాల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. రణ్‌గిరి డంబులా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళలు..
మహిళల ఆసియా కప్‌లో భాగంగా.. మంగళవారం నేపాల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. రణ్‌గిరి డంబులా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళలు సమిష్టి కృషితో రాణించి.. నేపాల్‌ను చిత్తుచిత్తుగా ఓడించారు. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు కేవలం 96 పరుగులకే పరిమితం కావడంతో.. 82 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయఢంకా మోగించింది. ఈ విజయంతో సెమీస్‌లో భారత్ బెర్తు కన్ఫమ్ అయ్యింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (81) అర్థశతకంతో తాండవం చేయడంతో పాటు హేమలత (47) మెరుగ్గా రాణించడం, రోడ్రిగ్స్ (28) మెరుపులు మెరిపించడంతో.. భారత జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేధనలో భాగంగా.. భారత బౌలర్లు అదరగొట్టారు. నేపాల్ బ్యాటర్లకు క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకునే అవకాశమే ఇవ్వలేదు. దీంతో.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఫలితంగా.. 82 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. సజీవన్ సజనా మినహాయిస్తే మిగిలిన వాళ్లందరూ అద్భుతంగా బౌలింగ్ వేశారు. దీప్తి శర్మ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 13 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టారు. అలాగే.. రాధా యాదవ్, అరుంధతి రెడ్డి తలా రెండు వికెట్లు పడగట్టారు. ఇక రేణుకా సింగ్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక మెయిడెన్ ఓవర్ వేయడంతో పాటు ఒక వికెట్ తీసింది. కాగా.. ఈ టోర్నీలో భారత జట్టుకి ఇది వరుసగా మూడో విజయం. తొలుత పాకిస్తాన్‌ని చిత్తుగా ఓడించిన భారత్.. ఆ తర్వాత యూఏఈ జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jul 23 , 2024 | 10:12 PM