India vs England, 3rd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే
ABN, Publish Date - Feb 15 , 2024 | 09:37 AM
భారత్, ఇంగ్లండ్ మధ్య 3వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
రాజ్‌కోట్: భారత్, ఇంగ్లండ్ మధ్య 3వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముందునుంచి ఊహించినట్టుగానే తెలుగుకుర్రాడు వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు. బ్యాటింగ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోతున్న కేఎస్ భరత్ స్థానంలో యువ ఆటగాడు ధృవ్ జురెల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక పేసర్ల విషయానికి వస్తే వైజాగ్ టెస్టులో ఆడిన ముకేశ్ కుమార్‌ని పక్కనపెట్టి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అక్షర్ పటేల్‌ను బెంచ్‌కు పరిమితం చేసి రవీంద్ర జడేజాను తీసుకున్నారు. కాగా ముకేశ్ కుమార్‌ను రంజీ ట్రోఫీలో ఆడేందుకు రిలీజ్ చేశారు.
తుది జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ ఉడ్, జేమ్స్ ఆండర్సన్.
Updated Date - Feb 15 , 2024 | 01:34 PM