Ishan Kishan: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇషాన్ కిషన్ పేరు తొలగింపు?
ABN, Publish Date - Feb 14 , 2024 | 11:20 AM
టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ గత నెల రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో విరామం కోరిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌కు బీసీసీఐ కూడా మద్ధతిచ్చింది. అయితే భారత్ తిరిగొచ్చిన ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో ఆడకపోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ గత నెల రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో విరామం కోరిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌కు బీసీసీఐ కూడా మద్ధతిచ్చింది. అయితే భారత్ తిరిగొచ్చిన ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో ఆడకపోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీమిండియాలోకి రీఎంట్రీ కోసం ఇషాన్ కిషన్ ఏదో ఒక క్రికెట్ ఆడాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పినప్పటికీ ఇషాన్ కిషన్ పెడచెవిన పెట్టాడు. రంజీ ట్రోఫీ జరుగుతున్నప్పటికీ దూరంగా ఉంటున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అత్యంత కీలకమైన ఈ రంజీ ట్రోఫీ ఆడకుండా సొంతంగా శిక్షణ పొందుతున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ భవిష్యత్‌పై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇషాన్ కిషన్‌పై బీసీసీఐ వర్గాలు సీరియస్‌గా ఉన్నాయని, అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించనున్నట్టు కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై వివరణ కోరగా బీసీసీఐ సీనియర్ అధికారి ఒక స్పందించారు. సెంట్రల్ ఒప్పందాలకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరగడంలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. కాగా ఇషాన్ కిషన్ ప్రస్తుతం బీసీసీఐ సీ-గ్రేడ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. ఏడాదికి రూ.1 కోటి పొందుతున్నాడు.
వరల్డ్ కప్‌నకు ముందు ఐపీఎల్.. ఆటగాళ్లపై ఒత్తిడి భారం..
జూన్ నెలలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. టీమిండియా జూన్ 5న న్యూయార్క్‌లో తొలి మ్యాచ్ ఆడనుంది. టీ20 సమరానికి కంటే ముందు ఆటగాళ్లు ఐపీఎల్2024లో ఆడనున్నారు. దీంతో వరల్డ్ కప్ సమయానికి ఆటగాళ్ల అలసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ దీనిపై బీసీసీఐ నోరు మెదపడం లేదు. ఐపీఎల్‌లో పాల్గొనవద్దంటే ఫ్రాంచైజీలకు మింగుడుపడకపోవచ్చుననే ఉద్దేశంతో బీసీసీఐ పెద్దలు సైతం సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో ఇండియన్ క్రికెటర్లకు కనీసం సూచనలు కూడా చేయడం లేదు. ఈ పరిణామంపై బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి భారీగా వేతనాలు పొందుతున్నారు. కాబట్టి నిర్ణయం వారి చేతుల్లో ఉండదు. ఫ్రాంచైజీలకు మ్యాచ్‌లను ఆడుతారు. అయితే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు, ఇతర సిబ్బందికి సంబంధించిన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఎన్‌సీఏ స్పోర్ట్స్ సైన్స్ అధినేత నితిన్ పటేల్‌కు అప్‌డేట్ చేయాలి’’ అని అన్నారు. ఐపీఎల్ మార్చి 22న మొదలయ్యి మే 26న ముగియవచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాబట్టి ఐపీఎల్ ప్లే-ఆఫ్‌కు అర్హత సాధించని జట్ల ఆటగాళ్లు బీసీసీఐ ముందుగా న్యూయార్క్ పంపించనుంది. నాకౌట్ దశల మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లు టోర్నీ ముగిశాక జట్టుతో కలవనున్నారు.
Updated Date - Feb 14 , 2024 | 11:20 AM