ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IND vs ENG: కుల్దీప్ పాంచ్ పటాకా.. రోహిత్, జైస్వాల్ హాఫ్ సెంచరీలు.. తొలి రోజు మనదే!

ABN, Publish Date - Mar 08 , 2024 | 02:29 AM

నామమాత్ర పోరే అయినా భారత జట్టు మొదటి రోజే అటు బంతితో.. ఇటు బ్యాట్‌తో ఇంగ్లండ్‌పై విరుచుకుపడింది. చల్లని వాతావరణంతో పాటు వికెట్‌పై తేమ కారణంగా మొదట పేసర్లకు పండగే అనుకున్నారు...

  • ఐదు వికెట్లతో రాణింపు

  • అశ్విన్‌కు నాలుగు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 218

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 135/1

జైస్వాల్‌, రోహిత్‌ అర్ధసెంచరీలు

ధర్మశాల: నామమాత్ర పోరే అయినా భారత జట్టు మొదటి రోజే అటు బంతితో.. ఇటు బ్యాట్‌తో ఇంగ్లండ్‌పై విరుచుకుపడింది. చల్లని వాతావరణంతో పాటు వికెట్‌పై తేమ కారణంగా మొదట పేసర్లకు పండగే అనుకున్నారు. అటు బ్యాటింగ్‌కు కూడా ఇబ్బందేమీ లేదని భావించారు. కానీ ధర్మశాలలో భారత స్పిన్నర్లు అంతా తారుమారు చేశారు. ముఖ్యంగా కుల్దీప్‌ యాదవ్‌ (5/72) సుడులు తిరిగే బంతులకు స్టోక్స్‌ సేన దాసోహమైంది. వారి టాప్‌-6 బ్యాటర్లలో ఐదుగురిని తనే పెవిలియన్‌కు చేర్చడంతో పర్యాటక జట్టు వెన్నువిరిగింది. అటు వందో టెస్టు ఆడుతున్న అశ్విన్‌ (4/51) టెయిలెండర్ల పనిబట్టడంతో తొలి రోజు గురువారం 57.4 ఓవర్లలో ఇంగ్లండ్‌ 218 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓపెనర్‌ జాక్‌ క్రాలే (79) మాత్రమే దీటుగా నిలబడినా, సహచరులంతా విఫలమయ్యారు. జడేజా పొదుపైన బౌలింగ్‌తో ఓ వికెట్‌ తీయడంతో ప్రత్యర్థి మొత్తం స్పిన్‌కే కుప్పకూలినట్టయ్యింది. ఆ తర్వాత భారత్‌ రోజు ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వీ (58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57) వన్డే తరహా ఆటతీరును ప్రదర్శించగా, క్రీజులో రోహిత్‌ (52 బ్యాటింగ్‌), గిల్‌ (26 బ్యాటింగ్‌) ఉన్నారు.

తొలి సెషన్‌లో జాగ్రత్తగా..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ గేమ్‌తో భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలని ఆలోచించింది. కానీ పేసర్లు బుమ్రా, సిరాజ్‌ తొలి సెషన్‌ ఆరంభంలో చక్కటి సీమ్‌ బౌలింగ్‌తో కట్టడి చేశారు. అయితే ఈ జోడీ వికెట్లు మాత్రం తీయలేకపోయింది. పేసర్లతో 14 ఓవర్లు వేయించాక కెప్టెన్‌ రోహిత్‌ స్పిన్నర్లను దించాడు. కుల్దీప్‌ తన తొలి ఓవర్‌లోనే డకెట్‌ (27) వికెట్‌ తీసి 64 పరుగుల భాగస్వామ్యానికి తెర దించాడు. ఎక్స్‌ట్రా కవర్‌ వైపు గాల్లోకి లేచిన బంతిని గిల్‌ కవర్స్‌ నుంచి పరిగెత్తుకెళ్లి డైవింగ్‌ క్యాచ్‌తో అందుకున్న తీరు వహ్వా.. అనిపించింది. అటు క్రీజులో పాతుకుపోయిన క్రాలే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్‌ ఐదో ఓవర్‌లో పోప్‌ (11) స్టంపౌట్‌ కావడంతో జట్టు లంచ్‌కు వెళ్లింది. అప్పటికి 100/2 స్కోరుతో ఇంగ్లండ్‌ పటిష్టంగానే కనిపించింది.

కుల్దీప్‌ మాయ: రెండో సెషన్‌లో ఇంగ్లండ్‌ మరింత తడబడి ఆరు వికెట్లు కోల్పోగా.. స్పిన్నర్‌ కుల్దీప్‌ ఇందులో ముగ్గురిని పెవిలియన్‌కు చేర్చాడు. టాపార్డర్‌నే కాకుండా మిడిలార్డర్‌ను కూడా తను కుదురుకోనీయలేదు. దీంతో 137/2 నుంచి ఒక్కసారిగా స్కోరు 183/8కి పడిపోయింది. సెషన్‌లో తొలి గంట తర్వాత కీలక క్రాలేను కుల్దీప్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత తన వరుస ఓవర్లలో బెయిర్‌స్టో (29), కెప్టెన్‌ స్టోక్స్‌ (0)లను సైతం అవుట్‌ చేశాడు. మధ్యలో రూట్‌ (26)ను జడేజా అవుట్‌ చేయడంతో 175 రన్స్‌ వద్దే జట్టు ఈ మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక అశ్విన్‌ ఒకే ఓవర్‌లో హార్ట్‌లీ (6), ఉడ్‌ (0) వికెట్లు తీయడంతో 194/8తో ఆఖరి సెషన్‌కు వెళ్లింది. ఆ తర్వాత మూడు ఓవర్లలోపే వీరి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఫోక్స్‌ (24), అండర్సన్‌ (0)ల వికెట్లను అశ్విన్‌ ఒకే ఓవర్లో తీశాడు.

శతక భాగస్వామ్యం :ఇంగ్లండ్‌ బ్యాటర్లు బెదిరిన ట్రాక్‌పై భారత ఓపెనర్లు అదరగొట్టారు. సాధికారిక బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 104 రన్స్‌ అందించారు. ఉడ్‌ ఓవర్‌లో రోహిత్‌ 6,4 బాదగా జైస్వాల్‌ అయితే చెలరేగాడు. స్పిన్నర్‌ బషీర్‌ తొలి ఓవర్‌లోనే మూడు సిక్సర్లతో 18 రన్స్‌ అందించాడు. ఇక తననే లక్ష్యంగా చేసుకుని వరుస ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అయితే 21వ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లతో 50 పరుగులు పూర్తి చేసినా మరో భారీ షాట్‌కు ముందుకెళ్లడంతో స్టంపయ్యాడు. ఆ తర్వాత రోహిత్‌ సైతం ఫిఫ్టీ పూర్తి చేయగా.. గిల్‌ నిలకడగా ఆడి రోజును ముగించారు.

స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలే (బి) కుల్దీప్‌ 79; డకెట్‌ (సి) గిల్‌ (బి) కుల్దీప్‌ 27; పోప్‌ (స్టంప్‌) జురెల్‌ (బి) కుల్దీప్‌ 11; రూట్‌ (ఎల్బీ) జడేజా 26; బెయిర్‌స్టో (సి) జురెల్‌ (బి) కుల్దీప్‌ 29; స్టోక్స్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 0; ఫోక్స్‌ (బి) అశ్విన్‌ 24; హార్ట్‌లీ (సి) దేవ్‌దత్‌ (బి) అశ్విన్‌ 6; ఉడ్‌ (సి) రోహిత్‌ (బి) అశ్విన్‌ 0; బషీర్‌ (నాటౌట్‌) 11; అండర్సన్‌ (సి) దేవ్‌దత్‌ (బి) అశ్విన్‌ 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 57.4 ఓవర్లలో 218 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-64, 2-100, 3-137, 4-175, 5-175, 6-175, 7-183, 8-183, 9-218, 10-218; బౌలింగ్‌: బుమ్రా 13-2-51-0; సిరాజ్‌ 8-1-24-0; అశ్విన్‌ 11.4-1-51-4; కుల్దీప్‌ 15-1-72-5; జడేజా 10-2-17-1.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (స్టంప్‌) ఫోక్స్‌ (బి) బషీర్‌ 57; రోహిత్‌ (బ్యాటింగ్‌) 52; గిల్‌ (బ్యాటింగ్‌) 26; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 30 ఓవర్లలో 135/1. వికెట్ల పతనం: 1-104; బౌలింగ్‌: అండర్సన్‌ 4-1-4-0; ఉడ్‌ 3-0-21-0; హార్ట్‌లీ 12-0-46-0; బషీర్‌ 11-2-64-1.

1

ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు (712) సాధించిన భారత బ్యాటర్‌గా జైస్వాల్‌. అలాగే ఒకే జట్టు (ఇంగ్లండ్‌)పై ఎక్కువ సిక్సర్లు (26) బాదిన భారత బ్యాటర్‌గానూ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్‌ (ఆసీస్‌పై 25)ను అధిగమించాడు.

తక్కువ బంతుల్లోనే (1871) 50 వికెట్లు పూర్తి చేసిన భారత బౌలర్‌గా కుల్దీప్‌. అక్షర్‌ (2205)ను అధిగమించాడు. గత 100 సంవత్సరాలలో వరల్డ్‌ క్రికెట్‌లో ఇన్ని తక్కువ బంతుల్లో ఏ స్పిన్నరూ 50 వికెట్ల మైలురాయి చేరలేదు.

2

టెస్టుల్లో తక్కువ ఇన్నింగ్స్‌ (16)లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్‌గా జైస్వాల్‌. వినోద్‌ కాంబ్లీ (14) టాప్‌లో ఉన్నాడు. అంతేకాకుండా ఒకే టెస్టు సిరీస్‌లో భారత్‌ తరఫున ఎక్కువ పరుగులు (712) సాధించిన రెండో బ్యాటర్‌. గవాస్కర్‌ (విండీస్‌పై 774, 732) ముందున్నాడు.

Updated Date - Mar 08 , 2024 | 07:13 AM

Advertising
Advertising