ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిఖత్‌.. రజతంతో సరి

ABN, Publish Date - Feb 12 , 2024 | 02:41 AM

స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా పోటీపడ్డ తెలంగాణ స్టార్‌ నిఖత్‌ జరీన్‌ ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. మహిళల 50 కిలోల ఫైనల్లో...

అమిత్‌, సచిన్‌కు స్వర్ణాలు

స్ట్రాంజా బాక్సింగ్‌

సోఫియా (బల్గేరియా): స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా పోటీపడ్డ తెలంగాణ స్టార్‌ నిఖత్‌ జరీన్‌ ఈసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. మహిళల 50 కిలోల ఫైనల్లో వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ 2-3తో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 20 ఏళ్ల సబీనా బొబొకులోవా చేతిలో ఓటమి చవిచూసింది. ఇక, మహిళల 66 కిలోల కేటగిరీలో భారత బాక్సర్‌ అరుంధతి 1-4తో ప్రపంచ చాంపియన్‌ లియు యాంగ్‌ (చైనా) చేతిలో, పురుషుల 48 కేజీలలో బరుణ్‌ సింగ్‌-ఖోద్జీ (కిర్గిస్థాన్‌) చేతిలో, 67 కిలోలలో రజత్‌-దులత్‌ (కజకిస్థాన్‌) చేతిలో ఓడి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత పంగల్‌ 51 కిలోల తుది పోరులో 5-0తో సన్‌ఝర్‌ (కజకిస్థాన్‌)ను చిత్తుచేసి స్వర్ణ పతకం సాధించాడు. 57 కిలోల అంతిమ సమరంలో సచిన్‌ సివాచ్‌ 5-0తోనే షఖ్‌జోద్‌ (ఉజ్బెకిస్థాన్‌)పై ఘన విజయంతో పసిడి పతకం కొల్లగొట్టాడు.

Updated Date - Feb 12 , 2024 | 02:41 AM

Advertising
Advertising