Nitish Reddy: తన స్ట్రాటజీని బయటపెట్టిన నితీశ్.. పెద్ద ప్లానింగే ఇది!
ABN, Publish Date - Apr 10 , 2024 | 09:40 AM
యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేది ఒక గొప్ప వరంగా మారింది. క్రికెట్‌లో తమ ప్రస్థానం కొనసాగించేందుకు గాను ఈ టోర్నమెంట్ వారికి ఎంతగానో సహాయపడుతోంది. అయితే.. అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. కేవలం కొందరు మాత్రమే తమ సత్తా చాటుకోగలుగుతున్నారు.
యువ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL) అనేది ఒక గొప్ప వరంగా మారింది. క్రికెట్‌లో తమ ప్రస్థానం కొనసాగించేందుకు గాను ఈ టోర్నమెంట్ వారికి ఎంతగానో సహాయపడుతోంది. అయితే.. అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. కేవలం కొందరు మాత్రమే తమ సత్తా చాటుకోగలుగుతున్నారు. అలాంటి వారి జాబితాలో తాజాగా తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) చేరిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ ఆటగాడు.. మంగళవారం (ఏప్రిల్ 9) పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి.. ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు.
Nitish Reddy: ఇదీ.. తెలుగోడి సత్తా.. నితీశ్‌పై పాట్ కమిన్స్ ప్రశంసలు
నిజానికి.. నితీశ్ గతేడాదిలోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. సన్‌రైజర్స్ టీమ్ అతడిని 2023లో రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున జరిగిన మ్యాచ్‌తో అతడు అరంగేట్రం చేశాడు. కానీ.. ఆ సమయంలో అతనికి తన ప్రతిభ చాటే అవకాశాలు పెద్దగా లభించలేదు. కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను.. 14 పరుగులే చేయగలిగాడు. అంతే.. ఎక్కువ కాలం బెంచ్‌కే పరిమితం అయ్యాడు. కానీ.. ఈ సీజన్‌లో తనకు ప్లేయింగ్ XI లో ఛాన్స్ రావడంతో, తన ట్యాలెంట్ నిరూపించుకున్నాడు. ముఖ్యంగా.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థశతకంతో చెలరేగి, జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్.. మొదట్లో క్రీజులో నిలదొక్కుకోవడం కోసం కొంచెం సమయం తీసుకున్నాడు. ఎప్పుడైతే క్రీజులో కుదురుకున్నాడో, అప్పటి నుంచి సింహంలా జూలు విదల్చడం ప్రారంభించాడు. ఒకవైపు ఆచితూచి ఆడుతూనే, మరోవైపు అనుకూలమైన బంతులు దొరికినప్పుడు బౌండరీలు బాదాడు. 32వ బంతికి అర్థశతకం అందుకున్న అతడు.. ఓవరాల్‌గా 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సుల సహకారంతో 64 పరుగులు చేశాడు. అంతేకాదండోయ్.. బౌలింగ్‌లోనూ తన ప్రతిభ చాటాడు. 3 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చిన.. జితేశ్ శర్మ లాంటి మెరుపు బ్యాటర్ వికెట్‌ని సైతం పడగొట్టాడు.
Maharashtra: తల్లి కాదు కసాయి.. ప్రియుడితో పారిపోవడం కోసం ఇద్దరు పిల్లల్ని..
అందుకే.. నితీశ్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ లభించింది. ఈ నేపథ్యంలోనే.. అతను తన ఆనందంతో పాటు స్ట్రాటజీని సైతం పంచుకున్నాడు. తన మీద తనకు నమ్మకం ఉండాలని.. జట్టు కోసం బాగా ఆడాలని తాను లోలోపలే మాట్లాడుకుంటూ ఉన్నానని.. ఫైనల్‌గా తాను జట్టుకి సహకారం అందించడంలో సఫలమయ్యానని తెలిపాడు. ఫాస్ట్ బౌలర్లు బాగా బౌలింగ్ వేయడాన్ని తాను చూశాను కాబట్టి, వారి బౌలింగ్‌లో ఆచితూచి ఆడానని అన్నాడు. ఇక స్పిన్నర్లు వచ్చాక.. కచ్ఛితంగా పరుగులు కొట్టాల్సిందేనని ఫిక్సయ్యానని, ఆ పనే తాను చేశానని పేర్కొన్నాడు. ఇదే పెర్ఫార్మెన్స్‌ని తదుపరి మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలనుకుంటున్నానని నితీశ్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 10 , 2024 | 09:43 AM