IND vs PM XI: హర్షిత్ రానా విధ్వంసం: ప్రైమ్ మినిస్టర్ జట్టు ఆలౌట్.. భారత్ ముంగిట భారీ లక్ష్యం
ABN, Publish Date - Dec 01 , 2024 | 02:03 PM
కాన్‌బెర్రాలో జరిగిన పింక్-బాల్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌ను భారత్ 240 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆస్ట్రేలియా తరఫున, సామ్ కాన్స్టాస్ 107 పరుగులు చేయగా, హన్నో జాకబ్స్ 61 పరుగులు చేశాడు.
కాన్‌బెర్రా: ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్టుతో జరిగిన పింక్ బాల్ వార్మప్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు 240 పరుగుల వద్ద ఆలౌటైంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా రెండు వికెట్లను కోల్పోయింది. సామ్ కాన్సాస్ట్, జాక్ క్లేటన్ వంటి ఆటగాళ్లను ఆతిథ్యజట్టు తిరిగి ఆటలోకి తీసుకువచ్చింది. సామ్ 107 పరుగులు చేయగా, హన్నో జాకబ్స్ 61 పరుగులు చేశాడు. వీరితో పాటు జాక్ క్లేన్ 52 బంతుల్లో 40 పరుగులు చేశాడు. మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ప్రముఖ్ కృష్ణ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ ముంగిట కంగారూ జట్టు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా గెలవాలంటే 46 ఓవర్లలో 241 పరుగులు చేయాల్సి ఉంది.
రానా స్పెషల్..
ఈ మ్యాచ్ లో భారత యువ పేసర్ హర్షిత్ రానా అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్ తో కేవలం 6 బంతుల్లోనే 4 వికెట్లు తీశాడు. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ 2 వికెట్లకు 131 పరుగుల వద్ద సునాయాసంగా నిలదొక్కుకుంది. 15వ ఓవర్లో దాడికి దిగిన హర్షిత్ ధాటికి 23, 25వ ఓవర్లలో పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టు 2 వికెట్ల నష్టానికి 131 పరుగుల వద్ద నిలకడగా కదులుతోంది, అయితే హర్షిత్ రెండు ఓవర్లలో నాలుగు-వికెట్లతో విజృంభించడంతో ఆరు వికెట్లకు 133 పరుగులకే కుప్పకూలింది. దీంతో మ్యాచ్ డైరెక్షన్ మార్చేసిన రానాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
IND vs PM XI: గిల్ రాకతో ఆ ఇద్దరు అవుట్.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండేది వీరే..
Updated Date - Dec 01 , 2024 | 02:03 PM