ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బ్యాడ్మింటన్‌కు సాయి ప్రణీత్‌ వీడ్కోలు

ABN, Publish Date - Mar 05 , 2024 | 02:00 AM

తెలుగు షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ బ్యాడ్మింటన్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్టు సోమవారం తన సోషల్‌ మీడియా...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలుగు షట్లర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ బ్యాడ్మింటన్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్టు సోమవారం తన సోషల్‌ మీడియా ఖాతాల్లో తెలిపాడు. 2010లో వరల్డ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకం నెగ్గి, అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రణీత్‌, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ 31 ఏళ్ల షట్లర్‌ 2017లో సింగపూర్‌ సూపర్‌ ఓపెన్‌ సిరీస్‌ను, 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించి సంచలనం సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత వరుస గాయాలతో సతమతమవుతున్న ప్రణీత్‌.. కొన్నాళ్లుగా టోర్నీల్లో ఆడడం లేదు. ఇక, త్వరలో అతను అమెరికాలోని ఓ బ్యాడ్మింటన్‌ అకాడమీలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ‘24 ఏళ్లుగా నాతో బ్యాడ్మింటన్‌ పెనవేసుకుపోయింది. మిశ్రమ భావోద్వేగాల నడుమ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని తీసుకున్నా. కోచ్‌గా త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నా. ఈ ప్రయాణంలో నన్ను ప్రోత్సహించిన కోచ్‌లు గోపీచంద్‌, ఆరిఫ్‌, గోవర్దన్‌లకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు’ అని ప్రణీత్‌ చెప్పాడు.

Updated Date - Mar 05 , 2024 | 02:00 AM

Advertising
Advertising