ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sania Mirza: విడాకుల గురించి సానియా మీర్జా పోస్ట్..నెట్టింట వైరల్

ABN, Publish Date - Jan 17 , 2024 | 06:25 PM

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మధ్య గత కొన్ని రోజులుగా విడాకుల విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సానియా మీర్జా తాజాగా విడాకులు, వివాహానికి సంబంధించి ఇన్‌స్టాస్టోరీలో ఒక రహస్య పోస్ట్‌ను పంచుకున్నారు. ఇది చదివిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా(Sania Mirza), పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మధ్య గత కొన్ని రోజులుగా విడాకుల విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ విడాకుల వార్తలపై ఇప్పటి వరకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మాజీ పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ బహిరంగంగా మాట్లాడలేదు. ఈ క్రమంలోనే సానియా మీర్జా తాజాగా విడాకులు, వివాహానికి సంబంధించి ఇన్‌స్టాస్టోరీలో ఒక రహస్య పోస్ట్‌ను పంచుకున్నారు. ఇది చదివిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు అది చూసిన పలువురు వీరి విడాకులు ఖాయమని అంటున్నారు.


మరిన్ని వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Supreme Court: స్కిల్ కేసులో ఆసక్తికర అంశాలను ప్రస్తావించిన సుప్రీం కోర్టు

ఇక ఆ పోస్ట్‌లో ఇలా ఉంది. 'వివాహం కష్టం, విడాకులు తీసుకోవడం కష్టం. మీ కష్టమైన మార్గాన్ని ఎంచుకోండి'. 'ఊబకాయం కష్టం, ఫిట్‌గా ఉండడం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి'. 'అప్పులు చేయడం కష్టం. ఆర్థిక క్రమశిక్షణ కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి'. 'చర్చలు జరపడం కష్టం. మాట్లాడకపోవడమే కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి'. 'జీవితం ఎప్పుడూ సులభం కాదు. ఇది ఎల్లప్పుడూ కష్టంగా ఉంటుంది. కానీ మన కష్టమైన మార్గాన్ని మనం ఎంచుకోవచ్చు. తెలివిగా ఎంచుకోండి' అని పేర్కొన్నారు. ఇది చూసిన పలువురు నెటిజన్లు సానియా డివోస్ తీసుకోవడం ఖాయమని అంటున్నారు. మరికొంత మంది మాత్రం అలా కాదని కామెంట్లు చేస్తున్నారు.

ఏది ఏమైనా సానియా మీర్జా పోస్ట్ తర్వాత వారి విడాకుల వార్త మరోసారి బలపడింది. ఇంతకుముందు సానియా మీర్జా, షోయబ్ మాలిక్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో తమ కుమారుడు ఇజాన్ బంగారు పతకాన్ని గెలుపొందడంతో కలిసి జరుపుకున్నారు. ఆ తర్వాత వీరి విడాకుల వార్త మరోసారి హల్‌చల్ చేసింది. ఇంతకు ముందు ఇద్దరూ కలిసి తమ కుమారుడు ఇజాన్ పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. దీని కారణంగా వారి బంధం క్షీణించిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ తాజాగా సానియా మీర్జా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Updated Date - Jan 17 , 2024 | 07:07 PM

Advertising
Advertising