ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుర్రాళ్లు కుమ్మేస్తారా?

ABN, Publish Date - Nov 08 , 2024 | 05:55 AM

సుదీర్ఘ ఫార్మాట్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా ఇప్పుడు ధనాధన్‌ పోరుపై దృష్టి సారించింది. టీ20 వరల్డ్‌కప్‌ చాంపియన్‌ హోదాలో.. అదే టోర్నీ ఫైనలిస్టు దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీ్‌సకు సిద్ధమైంది. నేడు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది.

  1. జోష్‌లో యువ భారత్‌

  2. ప్రతీకారం కోసం దక్షిణాఫ్రికా

  3. నేటి నుంచి నాలుగు టీ20ల సిరీస్‌

డర్బన్‌: సుదీర్ఘ ఫార్మాట్‌లో చిత్తుగా ఓడిన టీమిండియా ఇప్పుడు ధనాధన్‌ పోరుపై దృష్టి సారించింది. టీ20 వరల్డ్‌కప్‌ చాంపియన్‌ హోదాలో.. అదే టోర్నీ ఫైనలిస్టు దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీ్‌సకు సిద్ధమైంది. నేడు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. అయితే పూర్తి స్థాయి జట్టుతో కాకుండా సూర్యకుమార్‌ నేతృత్వంలోని భారత్‌.. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. ఇటీవలి టెస్టు సిరీ్‌సలో తమ సీనియర్లకు న్యూజిలాండ్‌ చేతిలో ఎదురైన దారుణ పరాభవాన్ని కుర్రాళ్లు మరిపించాలనుకుంటున్నారు. బౌన్సీ పిచ్‌లపై అటు బౌలర్లు.. ఇటు బ్యాటర్లు రాణిస్తూ ప్రస్తుతం సంధి దశలో ఉన్న భారత్‌ తరఫున తమ బెర్త్‌లను ఖాయం చేసుకోవాలనుకుంటున్నారు. అటు తొలి వరల్డ్‌కప్‌ దక్కకుండా చేసిన భారత్‌పై ఈసారి మాత్రం పైచేయి సాధించాలన్న కసితో ఆతిథ్య దక్షిణాఫ్రికా ఉంది. కానీ తమ చివరి ఆరు టీ20 మ్యాచ్‌ల్లో ఐదింటిని ఓడిన ఈ జట్టు ఏమేరకు పోటీనిస్తుందో చూడాల్సిందే. భారత్‌ మాత్రం ఆడిన 12 మ్యాచ్‌ల్లో పది నెగ్గి ఓ మ్యాచ్‌ను టై చేసుకుంది. మరోవైపు భారత జట్టులోని 15మంది ఆటగాళ్లలో 11 మందిని ఐపీఎల్‌ జట్లు అట్టిపెట్టుకోవడం విశేషం.


ఓపెనర్లపై దృష్టి: ఓపెనర్లుగా సంజూ శాంసన్‌, అభిషేక్‌ల రాణింపుపై అందరి దృష్టీ నెలకొంది. వాస్తవానికి శాంసన్‌ ఆడిన 33 మ్యాచ్‌ల్లో ఎనిమిదిసార్లు మాత్రమే ఓపెనింగ్‌ చేశాడు. బంగ్లాతో తన చివరి మ్యాచ్‌ల్లో 47 బంతుల్లో 111 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక్కడ కూడా అదే రీతిన రాణిస్తే రెగ్యులర్‌ ఓపెనర్లు జైస్వాల్‌-గిల్‌లకు పోటీనివ్వడం ఖాయమే. ఈ స్లాట్‌ కోసం పోటీలో ఉన్న మరో ఓపెనర్‌ అభిషేక్‌ ఐపీఎల్‌లో అదరగొట్టినవాడే. కానీ అతడి రెండో టీ20లో శతకం తర్వాత మరో ఆరు మ్యాచ్‌ల్లో కనీసం 20 దాటలేకపోయాడు. తిలక్‌ వర్మ కూడా ఈ ఫార్మాట్‌లో రెగ్యులర్‌ బెర్త్‌ను ఆశిస్తున్నాడు. ఇక అర్ష్‌దీప్‌, అవేశ్‌, వైశాక్‌, యష్‌ దయాల్‌లతో కూడిన పేస్‌ విభాగం అనుభవలేమిగా కనిపిస్తోంది. ఇందులో వైశాక్‌, యష్‌లకు తొలిసారిగా చోటు కల్పించారు. ఆర్‌సీబీ రిటైన్‌ చేసుకున్న యష్‌కు చాన్స్‌ లభిస్తే ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. రమణ్‌దీప్‌ అటు మిడిలార్డర్‌లో హిట్టర్‌గానే కాకుండా మీడియం పేసర్‌గా సేవలందించగలడు. అలాగే అతడి ఫీల్డింగ్‌ కూడా జట్టుకు ఉపయుక్తమే.

పటిష్టంగానే..: తమ చివరి సిరీ్‌సల్లో ఐర్లాండ్‌, విండీ్‌సలపై ఓటములు దక్షిణాఫ్రికా జట్టుపై ఒత్తిడిని పెంచాయి. దీంతో విజయాల జోష్‌లో ఉన్న భారత్‌ను కట్టడి చేయడం సవాల్‌ కానుంది. అయితే మిడిలార్డర్‌లో క్లాసెన్‌, మిల్లర్‌ల రాకతో బ్యాటింగ్‌ విభాగం పటిష్టమైంది. అలాగే వీరికి జతగా స్టబ్స్‌ ఉండనే ఉన్నాడు. మరోవైపు గా యాల నుంచి కోలుకున్న పేసర్లు జాన్సెన్‌, కొట్జీ జట్టులోకి రావడం ఉత్సాహాన్నిస్తోంది. కెప్టెన్‌గా మార్‌క్రమ్‌కు ఈ సిరీస్‌ గెలవడం అత్యవసరం కానుంది.

తుది జట్లు (అంచనా)

  • భారత్‌: శాంసన్‌, అభిషేక్‌, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌, రింకూ సింగ్‌, రమణ్‌దీప్‌, అక్షర్‌, బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, అవేశ్‌.

  • దక్షిణాఫ్రికా: రికెల్టన్‌, హెన్‌డ్రిక్స్‌, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), స్టబ్స్‌, మిల్లర్‌, క్లాసెన్‌, క్రుగెర్‌, జాన్సెన్‌, కేశవ్‌, బార్ట్‌మన్‌, కొట్జీ.

Updated Date - Nov 08 , 2024 | 05:55 AM