T20 Worldcup: ఇదే ఉత్తమ జట్టు.. అందుకే రింకూ సింగ్‌కు చోటు దక్కలేదేమో: సౌరవ్ గంగూలీ
ABN, Publish Date - May 04 , 2024 | 04:34 PM
వచ్చే నెల నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా టీ-20 ప్రపంచకప్ జరగబోతోంది. టీ20 ప్రపంచకప్ కోసం ఏప్రిల్ 30వ తేదీన బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ టీమ్‌లో యువ బ్యాటర్ రింకూ సింగ్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే.
వచ్చే నెల నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా టీ-20 ప్రపంచకప్ (T20 Worldcup) జరగబోతోంది. టీ20 ప్రపంచకప్ కోసం ఏప్రిల్ 30వ తేదీన బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ టీమ్‌లో యువ బ్యాటర్ రింకూ సింగ్‌కు (Rinku Singh) చోటు దక్కని విషయం తెలిసిందే. మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ పేరు లేకపోవడంతో చాలా మంది మాజీలు షాకయ్యారు. అతడికి ప్రపంచకప్ జట్టులో స్థానం కల్పించాల్సిందని వ్యాఖ్యానించారు. ఈ విషయమై తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్పందించాడు.
``టీ-20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేయడంలో కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్టర్లు అద్భుతంగా పని చేశారు. నేను చూసిన అత్యుత్తమ జట్లలో ఇది ఒకటి. రింకూ సింగ్‌కు స్థానం దక్కకపోవడం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. వెస్టిండీస్ మందకొడి పిచ్‌లపై అదనంగా మరో స్పిన్నర్ ఉంటే బాగుంటుందని సెలెక్టర్లు భావించినట్టున్నారు. అందుకే రింకూకు చోటు దక్కలేదు. అతనికి ఇంకా చాలా కెరీర్ ఉంది. ఈ నిర్ణయంతో రింకూ నిరుత్సాహపడకూడద``ని గంగూలీ వ్యాఖ్యానించాడు.
జూన్ 2వ తేదీన ఈ మెగా టోర్నీ ప్రారంభం కాబోతోంది. జూన్ 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు, ఐదు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి.
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
రిజర్వ్ ఆటగాళ్లు: శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.
ఇవి కూడా చదవండి..
T20 World Cup 2024: అమెరికా జట్టులో చోటు దక్కించుకున్న భారత ఆటగాళ్లు..మనతోనే పోటీ
Shreyas Iyer: వరల్డ్ కప్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు నో ప్లేస్.. అతడి రియాక్షన్ చూసి షాకైన కేకేఆర్ కోచ్!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 04 , 2024 | 04:34 PM