KL Rahul: ఆర్బీబీలోకి కేఎల్ రాహుల్..? ఓ వీడియోలో అడిగిన ప్రశ్నకు అతడి స్పందన ఏంటంటే..
ABN, Publish Date - Sep 16 , 2024 | 09:41 AM
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చే ఏడాది ఏ ఫ్రాంఛైజీ తరఫున ఆడబోతున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం జరగబోతున్న సంగతి తెలిసిందే. రాహుల్‌ను లఖ్‌నవూ రిటైన్ చేసుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) వచ్చే ఏడాది ఐపీఎల్ (IPL 2025)లో ఏ ఫ్రాంఛైజీ తరఫున ఆడబోతున్నాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వచ్చే ఏడాది ఐపీఎల్ మెగా వేలం (IPL Auction) జరగబోతున్న సంగతి తెలిసిందే. రాహుల్‌ను లఖ్‌నవూ రిటైన్ చేసుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట లఖ్‌నవూ మేనేజర్ సంజీవ్ గోయెంకా (Sanjeev Goenka)ను రాహుల్ కలిసి మాట్లాడాడు. అయినా రాహుల్‌ను తీసుకునే విషయంలో లఖ్‌నవూ టీమ్ నుంచి క్లారిటీ రాలేదు. దీంతో రాహుల్ వేరే ఫ్రాంఛైజీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున రాహుల్ ఆడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రాహుల్ స్పందించిన తీరు కూడా ఈ అనుమానాన్ని బలపరుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని.. ``నేను ఆర్సీబీకి వీరాభిమానిని. గతంలో మీరు ఆర్సీబీ తరఫున ఆడారు. మీరు మళ్లీ బెంగళూరు జట్టులోకి తిరిగి రావాలని, బాగా ఆడాలని కోరుకుంటున్నా`` అని వ్యాఖ్యానించాడు. ఆ అభిమాని మాటలకు రాహుల్ స్పందిస్తూ.. ``అలా జరగాలని ఆశిద్దాం`` అని జవాబిచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఏడాది ఐపీఎల్‌లో లఖ్‌నవూ టీమ్ పేలవ ప్రదర్శన చేసింది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ దారుణ పరాజయం పాలవడంతో మైదానంలోనే కెప్టెన్ రాహుల్‌ను ఓనర్ సంజీవ్ గోయెంకా నిలదీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్నుంచి కేఎల్ రాహుల్ భవిత్యవంపై ఊహాగానాలు మొదలయ్యాయి. రాహుల్ తమతోనే ఉంటాడని ఇటీవలి ఓ కార్యక్రమంలో ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ వ్యాఖ్యానించారు. అయినా రాహుల్ మాత్రం జట్టు మారడానికే నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Team India: విదేశీయుడికి టీమ్ ఇండియా కొత్త బౌలింగ్ కోచ్ బాధ్యతలు
Virat Kohli: స్వదేశానికి వచ్చేసిన విరాట్.. మరో రికార్డుకు చేరువలో కోహ్లీ
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 16 , 2024 | 09:41 AM