ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వావ్‌..ధీరజ్‌

ABN, Publish Date - Feb 26 , 2024 | 03:46 AM

తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌ ఆర్చరీ ఆసియా కప్‌ స్టేజ్‌ 1 పోటీల్లో అదరగొట్టాడు. ఈ టోర్నీలో ఏకంగా మూడు స్వర్ణాలు సాధించి వహ్‌వా అనిపించాడు.

ఆసియా ఆర్చరీలో

మూడు స్వర్ణాలు కైవసం

బాగ్దాద్‌: తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌ ఆర్చరీ ఆసియా కప్‌ స్టేజ్‌ 1 పోటీల్లో అదరగొట్టాడు. ఈ టోర్నీలో ఏకంగా మూడు స్వర్ణాలు సాధించి వహ్‌వా అనిపించాడు. వ్యక్తిగత విభాగం, టీమ్‌ ఈవెంట్‌, మిక్స్‌డ్‌ ఈవెంట్లలో విజేతగా నిలిచాడు. రికర్వ్‌ పురుషుల వ్యక్తిగత విభాగం ఫైనల్లో ధీరజ్‌ 7-3తో సహచరుడు తరుణ్‌దీ్‌పను చిత్తుచేసి పసిడి అందుకున్నాడు. ఇక, రికర్వ్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో ధీరజ్‌/సిమ్రన్‌జిత్‌ ద్వయం 6-0తో బంగ్లాపై, పురుషుల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో ధీరజ్‌, తరుణ్‌దీప్‌, ప్రవీణ్‌లతో కూడిన భారత త్రయం 5-2తో బంగ్లాపై గెలిచి స్వర్ణాలు దక్కించుకున్నారు. ఇక, వెటరన్‌ స్టార్‌ దీపికా కుమారి రికర్వ్‌ మహిళల వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్‌ ఈవెంట్లలో సత్తాచాటి రెండు స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత ఆర్చర్లు 10 స్వర్ణాలు, 3 రజతాలు, ఓ కాంస్యంతో కలిపి 14 పతకాలు కొల్లగొట్టారు.

Updated Date - Feb 26 , 2024 | 03:47 AM

Advertising
Advertising