Airtel Recharge Plans: ఎయిర్‌టెల్ బంపరాఫర్.. రూ.9కే అన్‌లిమిటెడ్ డేటా కానీ..
ABN, Publish Date - Jun 21 , 2024 | 03:26 PM
ఎయిర్‌టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లతో(Airtel Recharge Plans) కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. కంపెనీ ఈ మధ్యే తక్కువ ధరలో ఎక్కువ కాలం చెల్లుబాటును అందించే రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. తాజాగా మరో ప్లాన్‌తో ముందుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్‌టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లతో(Airtel Recharge Plans) కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. కంపెనీ ఈ మధ్యే తక్కువ ధరలో ఎక్కువ కాలం చెల్లుబాటును అందించే రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. తాజాగా మరో ప్లాన్‌తో ముందుకొచ్చింది. కొత్త డేటా ప్లాన్ ధర రూ. 9కే అపరిమిత డేటాను(Unlimited Data) అందిస్తుంది. అయితే షరతులు వర్తిస్తాయి.
ప్లాన్ వివరాలు
ఎయిర్‌టెల్ రూ.9 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ అపరిమిత డేటాను అందిస్తుంది. కానీ ఎలాంటి సర్వీస్ వాలిడిటీని ఇవ్వదు. దీనికి తోడు ఈ ప్లాన్ ఒక గంట మాత్రమే చెల్లుబాటు అవుతుంది. FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) పరిమితితో 10GB డేటా వరకు వస్తుంది. ఆ తరువాత దీని వేగం 64 Kbps కు తగ్గుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్‌లు ఒక గంట పాటు 10GB డేటాను పొందడానికి ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఎవరికి బెస్ట్?
పెద్ద ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయవలసి వస్తే, తాత్కాలిక డేటా బూస్ట్ అవసరమైతే రూ.9 ప్లాన్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం, మీరు వేరే సర్వీస్ ప్రొవైడర్ నుండి 10GB వరకు డేటా పొందాలంటే, ఇందుకోసం దాదాపు రూ.100 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ ప్లాన్‌తో కేవలం రూ. 9కే పొందవచ్చు. ఒక్క గంటపాటు మాత్రమే అందుబాటులో ఉంటుందనే బాధ తప్పా.. ఈప్లాన్ చాలా బెటర్. రెండు వోచర్‌లను కొనుగోలు చేస్తే రూ.18 చెల్లించాల్సి ఉంటుంది.
అంటే 20 జీబీ డేటా అందుతుంది. ప్రతి గిగాబైట్ డేటా అతి తక్కువ ఖర్చుతో వస్తుందన్నమాట. ఇది కస్టమర్‌లకు అద్భుతమైన డీల్ అనే చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రస్తుతం ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది. దీంతోపాటు తక్కువ ధరలో ఎక్కువ కాలం చెల్లుబాటును అందించే రూ. 500 లోపు అన్ని ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
రూ.155 ప్లాన్‌తో, వినియోగదారులు 24 రోజుల సర్వీస్ వాలిడిటీ, 1GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 300 SMSలను పొందుతారు.
రూ.179 ప్లాన్‌తో 28 రోజుల చెల్లుబాటు, 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లు.
రూ.199 ప్లాన్‌లో 3GB డేటా, 300 SMS, 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్.
రూ. 279 ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 45 రోజుల సర్వీస్ వాలిడిటీ, 2GB డేటా, 600 SMSలతో వస్తుంది.
రూ.395 ప్లాన్‌లో 6GB డేటా, 70 రోజుల సర్వీస్ వాలిడిటీ, అపరిమిత వాయిస్ కాలింగ్, 600 SMSలు ఉన్నాయి.
రూ.455 ప్లాన్ 6GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 900 SMS, 84 రోజుల సర్వీస్ వాలిడిటీని అందిస్తుంది.
Airtel: 168 జీబీ డేటా.. 20కిపైగా ఓటీటీ యాప్స్.. ఎయిర్‌టెల్‌లో అదిరిపోయే ఈ ప్లాన్ మీకు తెలుసా
For Latest News and Technology News click here..
Updated Date - Jun 21 , 2024 | 03:26 PM