Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరిపోయే వార్త.. ఆ ప్లాన్ వాలిడిటీ 14 రోజులకు పెంపు
ABN, Publish Date - Jun 09 , 2024 | 05:37 PM
భారత్‌లో ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఎయిర్‌టెల్(Airtel) ఒకటి. ఇది సరసమైన ధరలకే అత్యత్తమైన ప్లాన్‌లను అందిస్తోంది. అయితే తాజాగా ఎయిర్ టెల్ ఒక ప్లాన్ వాలిడిటీ గడువును పెంచింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఎయిర్‌టెల్(Airtel) ఒకటి. ఇది సరసమైన ధరలకే అత్యత్తమైన ప్లాన్‌లను అందిస్తోంది. అయితే తాజాగా ఎయిర్ టెల్ ఒక ప్లాన్ వాలిడిటీ గడువును పెంచింది. అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ ప్లాన్ వాలిడిటీ పొడగించడం ఎయిర్ టెల్ యూజర్లకు నిజంగా శుభ వార్తే చెప్పుకోవచ్చు. రూ.395 ప్లాన్ గడువును ఎయిర్ టెల్ పొడగించింది.
ఇది ఇప్పటివరకు వినియోగదారులకు 56 రోజుల వాలిడిటీని అందించింది. అయితే తాజాగా ఈ గడువును 56 నుండి 70 రోజులకు పెంచింది. అంటే అదే ధరతో కస్టమర్లు మరో 14 రోజులపాటు ప్లాన్‌ని వినియోగించుకోవచ్చు. ఈ పొడిగింపుతో ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎక్కువ కాలం పాటు ఉచిత కాలింగ్, అపరిమిత డేటాను ఆస్వాదించగలరు.
రూ. 395 ప్లాన్ ప్రయోజనాలు
రూ. 395 విలువైన ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ అపరిమిత ప్లాన్‌ల విభాగంలో ఉంది
దీనితో ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది.
70 రోజులపాటు చెల్లుబాటు అవుతుంది.
70 రోజుల వ్యవధిలో కేవలం 6GB డేటాను మాత్రమే అందిస్తుంది.
600 SMSలను అందిస్తుంది.
అదనపు ప్రయోజనాలు
రూ.395 ప్లాన్ సబ్‌స్క్రైబర్‌లు ఆరోగ్య సేవా వేదిక అయిన అపోలో 24|7 సర్కిల్‌కి యాక్సెస్ పొందుతారు.
ప్లాన్‌లో ఉచిత హెలోట్యూన్‌లు కూడా ఉన్నాయి.
ఎయిర్‌టెల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన వింక్ మ్యూజిక్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో ప్లాన్ వస్తుంది.
Updated Date - Jun 09 , 2024 | 05:37 PM