ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Android 15: యాండ్రాయిడ్ 15 రిలీజ్ డేట్ ఇదేనా!

ABN, Publish Date - Sep 21 , 2024 | 06:16 PM

యాండ్రాయిడ్ 15 వచ్చే నెల 15న పిక్సెల్ ఫోన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న వార్తలు ప్రస్తుతం హల్‌చల్ చేస్తున్నాయి. ఆ తరువాత క్రమంగా ఇతర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్‌ దీన్ని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇంటర్నెట్ డెస్క్: యాండ్రాయిడ్ 15 ఎప్పుడు విడుదల అవుతుందా అని టెక్ రంగం ఔత్సాహికులు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా గూగుల్ కొత్త యాండ్రాయిడ్ వర్షెన్లను కొత్త పిక్సెల్ ఫోన్లతో పాటు విడుదల చేస్తుంది. కానీ ఈసారి మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గూగుల్.. కేవలం పిక్సెల్ 9ను మాత్రమే విడుదల చేసింది. దీంతో, యాండ్రాయిడ్ లేటెస్టు వర్షెన్ కోసం ఎదురు చూస్తున్న వారందరూ నిరాశ చెందారు. అయితే, వచ్చె నెలలో యాండ్రాయిడ్ 15 (Android 15) కచ్చితంగా విడుదలవుతుందన్న వార్తలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. వీడియోను ప్రమోట్ చేసేందుకు కొత్త ఫీచర్లు


వాస్తవానికి యాండ్రాయెడ్ 15 చాలా కాలంగా బీటా టెస్టింగ్ దశలో ఉంది. ఇటీవలే దీన్ని యాండ్రాయిడ్ ఓపెన్ సోర్సు ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఆ తరువాత, పిక్సెల్ ఫోన్లతో పాటు మార్కెట్లో విడుదల అవుతుందని అంతా భావించారు. కానీ పిక్సెల్ మాత్రమే విడుదల కావడంతో తదుపరి ఏం జరుగుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Gmail Accounts: ఇకపై ఈ జీమెయిల్ ఖాతాలన్నీ రద్దు..

అయితే యాండ్రాయిడ్ 15 జారీలో జాప్యంతో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఎటువంటి బగ్స్, గ్లిచెస్ లేని వర్షన్ రాబోతోందని కొందరు టెక్ ఔత్సాహికులు నెట్టింట కామెంట్ చేస్తున్నారు. అక్టోబర్ 15న ఇది విడుదల కావచ్చన్న వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వర్షెన్‌ను టెన్సర్ చిప్ ఆధారిత పిక్సెల్ ఫోన్లలో అందుబాటులోకి తెస్తామని గూగుల్ పేర్కొంది. అంటే.. పిక్సెల్ 6 ఆపై ఫోన్లకు మాత్రమే ఈ లేటెస్ట్ వర్షన్ అందుబాటులోకి వస్తుందని. అంతకుముందటి పిక్సెల్ ఫోన్లు వినియోగించే వారికి మాత్రం నిరాశతప్పదని నిర్ధారణ అయ్యింది.

Instagram: టీనేజర్ల ఖాతాల విషయంలో ఇన్‌స్టాగ్రామ్ కీలక నిర్ణయం.. ఇకపై నియంత్రణ మొత్తం..


ఇక మిగతా ఫోన్ల బ్రాండ్‌లలో ఈ వర్షెన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తున్నదానిపై క్లారిటీ లేదు. సామ్‌సంగ్ జులైలో యాండ్రాయిడ్ 15 ఆధారిత ఒన్ యూఐ 7.0 ఓఎస్‌ను విడుదల చేయాల్సి ఉండగా అనూహ్యంగా అది వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు విడుదల చేసేదీ ఇప్పుడే చెప్పలేమని సంస్థ ప్రకటించింది. అయితే, ఒన్‌ప్లన్ మాత్రం తన ఆక్సీజన్ ఓఎస్ 15 బీటా వర్షెన్‌ను ఈ నెల లేదా వచ్చే నెలలో విడుదల చేయొచ్చన టాక్ నడుస్తోంది.

Smartphone: రూ.7 వేలకే సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్.. 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకా..

Read Latest and Technology News,

Updated Date - Sep 21 , 2024 | 06:22 PM