ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

8000mAh Battery: వామ్మో.. స్మార్ట్ ఫోన్లల్లో ఇకపై 8000 ఎమ్ఏహెచ్ బ్యాటరీలు!

ABN, Publish Date - Dec 03 , 2024 | 07:12 AM

గత కొన్నేళ్లుగా యాండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల తయారీదారులు ఫోన్ల బ్యాటరీ సామర్థ్యాన్ని అంతకంతకూ పెంచుతూ వెళుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి ఏకంగా 8000 ఎమ్ఏహెచ్ బ్యాటరీలు ఉన్న స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: గత కొన్నేళ్లుగా యాండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల తయారీదారులు ఫోన్ల బ్యాటరీ సామర్థ్యాన్ని అంతకంతకూ పెంచుతూ వెళుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి ఏకంగా 8000 ఎమ్ఏహెచ్ బ్యాటరీలు ఉన్న స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి (Technology).

Clocks tick faster on Moon: చంద్రుడిపై కాలానికి వేగమెక్కువ! ఎంత స్పీడో తెలిస్తే..


ఈ ఏడాదిలో రియల్‌మీ, ఒప్పో లాంటి బ్రాండ్స్ ఎక్కువ సామర్థ్యంగల బ్యాటరీలున్న ఫోన్లను మార్కెట్లో విడుదల చేశాయి. ఐఫోన్, సామ్‌సంగ్‌కు గట్టి పోటీని ఇచ్చే ప్రయత్నం చేశాయి. ఉదాహరణకు ఈ మధ్య విడుదలైన రియల్‌మీ జీటీ 7 ప్రో బ్యాటరీ సామర్థ్యం 6500 ఎమ్ఏహెచ్ కాగా ఐఖ్యూ0013, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ల్లో వరుసగా 6150 ఎమ్ఏహెచ్, 5910 ఎమ్ఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న శామ్‌సంగ్ ఎస్24 అల్ట్రా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ల బ్యాటరీల సామర్థ్యం 5 వేల ఎమ్ఏహెచ్, 4685 ఎమ్ఏహెచ్‌గా ఉంది.

అయితే, త్వరలో విడుదలయ్యే ఫోన్లలో బ్యాటరీల సామర్థ్యం ఇంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా చైనా కంపెనీ రియల్‌మీ ఏకంగా 8వేల ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది లాంచ్ చేయొచ్చని చెబుతున్నాయి. రియల్‌మీ జీటీ 8లోనే ఈ బ్యాటరీ అందుబాటులోకి వచ్చే ఛాన్సుంది.

Pixel Laptop: త్వరలో పిక్సెల్ లాప్‌టాప్ లాంచ్ చేయనున్న గూగుల్?


బ్యాటరీ సామర్థ్యం, చార్జింగ్ స్పీడుకు సంబంధించి రియల్‌మీ వివిధ రకాల కాంబినేషన్లను పరీక్షిస్తోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. 42 నిమిషాల్లో ఫుల్ ఛార్జి ఇచ్చే 120 డబ్ల్యూ చార్జింగ్ స్పీడుతో 7000 ఎమ్‌‌ఏహెచ్ బ్యాటరీ, 55 నిమిషాల చార్జింగ్ టైమ్‌ ఇచ్చే 100 వాట్స్ చార్జింగ్ స్పీడుతో 7500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 70 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ చేసే 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో 8000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని రియల్‌ మీ పరీక్షిస్తున్నట్టు సమాచారం. బ్యాటరీ సామర్థ్యం, చార్జింగ్ స్పీడు మధ్య సమతౌల్యం కోసం కంపెనీ ప్రయత్నిస్తోంది. అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీలకు జతగా తక్కు స్పీడున్న చార్జింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేలా కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ఈ ప్లాన్‌లో రియల్ మీ విజయం సాధిస్తే స్మార్ట్‌ఫోన్ల రంగంలో ఓ కొత్త శకానికి నాంది పలికినట్టేనని వ్యాఖ్యాతలను అభిప్రాయపడుతున్నారు. ప్రీమియం ఫోన్ సెగ్మెంట్‌పై సంస్థకు పట్టు మరింత చిక్కొచ్చని చెబుతున్నారు.

For More Technology News and Telugu News

Updated Date - Dec 03 , 2024 | 07:18 AM