ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

iPhones Exports: మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లు.. 2 నెలలు, రికార్డు స్థాయి ఎగుమతులు

ABN, Publish Date - Jun 12 , 2024 | 03:59 PM

గత రెండు నెలల్లో రూ.16 వేల 500 కోట్ల ఐఫోన్లు విదేశాలకు ఎగుమతి(iPhones Exports) అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లోనే 2 బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన ఐఫోన్‌లను ఎగుమతి చేయడం మేడ్ ఇన్ ఇండియా సంకల్పానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఢిల్లీ: గత రెండు నెలల్లో రూ.16 వేల 500 కోట్ల ఐఫోన్లు విదేశాలకు ఎగుమతి(iPhones Exports) అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లోనే 2 బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన ఐఫోన్‌లను ఎగుమతి చేయడం మేడ్ ఇన్ ఇండియా సంకల్పానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. పారిశ్రామిక వర్గాల డేటా ప్రకారం.. భారత్‌లోని మొత్తం ఐఫోన్ల ఉత్పత్తి, అసెంబ్లింగ్‌లో ఎగుమతులు శాతం 80పైగా ఉంది. మొత్తం ఎగుమతుల్లో 65 శాతం వాటా కలిగిన ఫాక్స్‌కాన్‌ సహా Apple ముఖ్య సరఫరాదారులు ఇటీవల తమ సరఫరాను గణనీయంగా పెంచుకున్నారు.

FY24 విజయం, రికార్డు ఉత్పత్తి

గత ఆర్థిక సంవత్సరంలో Apple భారత్‌లో దాదాపు14 బిలియన్ డాలర్ల(రూ.లక్ష కోట్లకు పైగా) iPhoneలను ఉత్పత్తి చేసింది. వీటి మార్కెట్ విలువ సుమారు 22 బిలియన్ డాలర్లు. ఇది దేశంలో ఐఫోన్ కంపెనీల వృద్ధిని తెలియజేస్తోంది.


దేశీయంగా బలోపేతం...

దేశంలో నైపుణ్య సామర్థ్యాలు పెరగడంతో యాపిల్.. ఐఫోన్ ఉత్పత్తి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఏడు ఐఫోన్లలో ఒకటి భారత్‌లోనే తయారవుతోందని ప్రధాని మోదీ ఇటీవలే పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించింది.

భవిష్యత్తులో...

2028 నాటికి మొత్తం ఐఫోన్‌లలో 25 శాతం భారత్‌లోనే తయారు అవుతాయని అంచనా. 2023లో దేశంలో 10 మిలియన్ల ఐఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి వాటా 7 శాతంగా ఉంది.

Updated Date - Jun 12 , 2024 | 03:59 PM

Advertising
Advertising