Google Maps: రోడ్డు మూసివేతలు, ప్రమాదాలను గూగుల్ మ్యాప్‌లోనే తెలుసుకోండిలా
ABN, Publish Date - Aug 03 , 2024 | 03:01 PM
భారత్‌లో 2022లో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి గంటకు 53 ప్రమాదాలు(Road Accidents),19 మరణాలు సంభవించాయి. సగటున రోజుకి 1,264 ప్రమాదాలు, 42 మరణాలు నమోదయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో 2022లో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి గంటకు 53 ప్రమాదాలు(Road Accidents),19 మరణాలు సంభవించాయి. సగటున రోజుకి 1,264 ప్రమాదాలు, 42 మరణాలు నమోదయ్యాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నివేదికను 2023లో విడుదల చేసింది. అయితే సగటు ప్రమాదాలు, మరణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. రోడ్డుపై సూచికలు లేకపోవడం, కొత్త రోడ్లపై ప్రయాణాలు చేయడం ప్రమాదాలకు గల కారణాలుగా ఉన్నాయి.
అయితే వీటన్నింటికీ చెక్ పెట్టేలా ఒక పరిష్కార మార్గం కనిపెట్టింది గూగుల్. రోడ్డుపై జరుగుతున్న ప్రతి సంఘటనను గుర్తించేందుకు గూగుల్ ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులను అప్రమత్తం చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. క్రాష్‌లు, రద్దీ, రోడ్‌వర్క్‌లు, లేన్‌లను మూసివేయడం, నిలిచిపోయిన వాహనాలు, రోడ్డుపై ఉన్న వస్తువులను గుర్తించి ముందుగానే గూగుల్ వినియోగదారులకు నివేదిస్తుంది. వినియోగదారులు ఈ ఫీచర్‌తో సురక్షిత ప్రయాణం చేయవచ్చు. ఈ ఫీచర్ ఆసక్తికరంగా అనిపిస్తే దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం.
Step 1. మీ ఫోన్‌లో Google మ్యాప్స్‌ని తెరిచి, మీ గమ్యాన్ని ఎంటర్ చేయండి.
Step 2. నావిగేషన్‌ను ప్రారంభించి, మీ రూట్ సమాచారాన్ని ప్రదర్శించే దిగువ బార్ నుంచి పైకి స్వైప్ చేయండి.
Step 3. మ్యాప్ కింద ఉన్న "Add a Report" బటన్‌పై నొక్కండి.
Step 4. ఆప్షన్ల జాబితా నుంచి మీరు నివేదించాలనుకుంటున్న ఘటన రకాన్ని ఎంచుకోండి.
Step 5. చివరగా నివేదికను నిర్ధారించండి. తద్వారా మీ సమీపంలో ప్రయాణించే ఇతర వినియోగదారులకు ఎదురుగా ఉన్న ప్రమాదాన్ని గూగుల్ తెలియజేస్తుంది.
కృత్రిమ మేథ సాయంతో నడిచే ఈ కొత్త ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫోర్ వీలర్ వాహనాలను నడపడానికి ఇరుకైన రోడ్ల వినియోగాన్ని ఈ ఫీచర్ తగ్గిస్తుంది. ఏఐని ఉపయోగించి గూగుల్ మ్యాప్స్ రహదారి వెడల్పును అంచనా వేస్తుంది.
దేశంలోని అందరు వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఉపగ్రహ చిత్రాలు, శాటిలైట్ వ్యూ సాయంతో రహదారిపై ఉన్న ప్రమాదాలను గుర్తించి గూగుల్ అప్రమత్తం చేస్తుంది. తద్వారా ఎదురుగా ఉన్న ప్రమాదాన్ని ముందే అంచనా వేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి.
Updated Date - Aug 03 , 2024 | 03:01 PM