మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8a కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలన్నీ మీకోసమే.. ఓ లుక్కేయండి..

ABN, Publish Date - Apr 21 , 2024 | 04:34 PM

గూగుల్ నుంచి మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ బయటకు రానుంది. గూగుల్ పిక్సెల్ 8ఎ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. పిక్సెల్ ఆఫ్ ది ఇయర్ (I/O) ఈవెంట్‌లో ఈ కొత్త పిక్సెల్ 8ఎ ఫోన్‌ను గూగుల్ ఆవిష్కరించనుంది. మే 14వ తేదీన ఈ ఫోన్‌లను గూగుల్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8a కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలన్నీ మీకోసమే.. ఓ లుక్కేయండి..
Google Pixel 8a

గూగుల్ నుంచి మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ బయటకు రానుంది. గూగుల్ పిక్సెల్ 8ఎ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. పిక్సెల్ ఆఫ్ ది ఇయర్ (I/O) ఈవెంట్‌లో ఈ కొత్త పిక్సెల్ 8ఎ ఫోన్‌ను గూగుల్ ఆవిష్కరించనుంది. మే 14వ తేదీన ఈ ఫోన్‌లను గూగుల్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ స్పెషిఫికేషన్స్, రేటు, వేరియంట్ల గురించి రకరకాల లీక్‌లు బయటకు వస్తున్నాయి. ఆ లీక్‌ల ఆధారంగా ఈ ఫోన్ గురించి కొన్ని విశేషాలు మీకోసం..


పిక్సెల్ 8a ఫీచర్లు (అంచనా):

1) గూగుల్ పిక్సెల్ 8a ఫోన్లు నాలుగు కలర్లలో అందుబాటులోకి రాబోతున్నాయి.

2)పిక్సెల్ 8లో ఉపయోగించిన గూగుల్ టెన్సార్ జీ3 చిప్‌తో ఈ ఫోన్ రాబోతోంది.

3)6.1 ఇంచ్ ఓ-ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో, 120HZ రీఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ డిస్‌ప్లే ఉండనుంది.

4)వెనుక వైపు 64 MP ప్రైమరీ కెమేరా, 13 MP ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమేరా వెనుక వైపు ఉండనున్నాయి.

5)ఐపీ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది.

6)5G, 4G LTE కనెక్టివిటీతో AI సంబంధిత ఫీచర్లతో యూజర్‌కు మరింత మెరుగైన అనుభూతిని అందించునుంది.

గూగుల్ పిక్సెల్ 8a ధర:

గూగుల్ పిక్సెల్ 8a రెండు వేరియెంట్లలో అందుబాటులోకి రానుంది. 128 జీబీ వేరియంట్‌తో వచ్చే మొబైల్ ధర రూ.42 నుంచి 43 వేల మధ్యలో ఉండవచ్చు. ఇక, 256 జీబీ వేరియంట్ ధర రూ.47 వేల నుంచి 48 వేల మధ్యలో ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ తెలివి తేటలు చదువులో పెడితే.. ఓ స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్ చూసి నివ్వెరపోయిన టీచర్.. ఏం జరిగిందంటే..


Viral: గుజరాత్‌లో బయటపడిన 4.7 ఏళ్ల కోట్ల క్రితం నాటి పాము అవశేషాలు.. ఈ పాము కథేంటో తెలిస్తే..!


మరిన్ని టెక్నాలజీ వార్తలు కోసం చదవండి..

Updated Date - Apr 21 , 2024 | 04:34 PM

Advertising
Advertising